Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎన్ని కష్టాలనోర్చుకున్నవో
ఎన్ని అవమానాలను దాటివచ్చావో
జీవితమంతా చీకటి వెంటాడిన
వెలుగురేఖవై నీ నడకసాగించావు
చదువులోనే బతుకున్నదని భవిష్యత్తు మార్చే వెలుగౌతదని
మనసును రాయిచేసుకుని
ఆరుబయట నానుతూ ఎండుతూ వణుకుతూ తనువునో శిలగా మార్చి కాలమాన దేశపరిస్థితులను అలోచనతో అంచనవేసి
అందరికంటే ఉన్నతస్థానం సాధించావు
విశ్వదర్శనంతో వికసించావు
మనువాదాన్ని ఎదిరించావు
అణిచివేత అడ్డకున్నావు
దిక్కారస్వరమై నినదించావు
దీనులందరికి దిక్కయ్యావు
బతుకునుమార్చే వెలుగయ్యావు
వెనకబడిన బడుగు బలహీనవర్గాలకు దేవుడివయ్యావు
అంటరానితనం అంతమే పంతమయి సాగావు
గాడాంధకారమలుముకుని
అల్లకల్లోలంగా
దీనస్థితిలో చిక్కుకున్న జాతిని
స్వచ్ఛమైన ఆలోచనతో
హృదయంలో నింపుకున్న ప్రయత్నపోరాటం ఆరిపోనిక
మనిషిగా బావిస్వప్నాలను చెరిగిపోకుండా చెదిరిపోకుండ
ఒడిసిపట్టి వారథియైనావు
ఆనాడు యథార్థ సంఘటనలను కళ్ళతో చూసి మదిలో ముద్రించుకున్నావు
రోజు దహనమవుతున్నా
నీలోని దాహానికది దారైంది
జంకెరుగని గమనంలో పయనించావు
మనిషిని చీదరించుకునే సమాజంలో
ఊహించని ఉప్పెనెపుడు హేళనతో పక్కనే పొంచిపుడు
నీలోని అంతరాత్మ నీకు మరొక జన్మనిచ్చి నడిపించింది
పట్టపగలు ఏ వీధిలో అడుగెట్టిన కులరక్కసి వెంటాడుతుంటే
బానిసదేశంలోనే మరో యవజ్జీవితబానిసలా బతుకీడ్చే జాతికోసం ఆధునిక ఆలోచనలతో అడుగేసిన పరిష్కారమేధావివి
నీవు రాసిన రాజ్యాంగం
ప్రపంచానికే ఆదర్శంగా
జాతిజనులందరు సంతోషించేదిగా
వెలుగొందుతున్నా
ఓటుహక్కు మాత్రం
మందుసీసలకు అమ్ముడయ్
బానిసలై బతుకుతున్నరు
అధికారమైతే మారలేదు
పాలించేటోళ్ళు మారలేదు
బతుకుల వెలుగులు లేవు
ఏదేమైనా
కులాల సమాజం రోజురోజుకు కొత్త అవతారమెత్తింది మార్పైతే రాలేదు
దేశం అభివృద్ధికి నోచలేదు
అభివృద్ధి చెందుతూ....ఉంది
సి. శేఖర్(సియస్సార్),
పాలమూరు,
9010480557.