Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మట్టి మనిషే అయినా
మట్టిని చీల్చుకొని పూచి
పరిమళించిన వికాస కుసుమం
ప్రశ్నించడం మానేసిన మనిషి బానిసే అని
చైతన్య శూన్యుడని
చైతన్యంతో ఉంటావా?బానిసగా ఉంటావా?
తేల్చుకొమ్మని బహుజనులకు బోధించిన దార్శనిక వాచకం
అక్షరాన్నీ-ఆలోచనను ఆయుధాలుగా చేసుకొని
మార్పుయుద్ధం మొదలుపెట్టమని
కర్తవ్య బోధ చేసిన బుద్ధుడు అధ్యాపకుడు
మహాను భావుడెవరో ఆకాశమునుండి నేలమీదకు ఊడిపడి
నీ దుఃఖం పోగొడుతాడనే మనువాద ఊబినుండి బయటపడితేనే మనుగడ అని
నిన్ను నీవే ఉద్ధరించుకోవాలనే బతుకు పాఠాలు నేర్పిన దార్శనికుడు
నిన్ను నీవుతెలుసుకొని
కుల పునాదులను కూల్చేస్తేనే
నీజాతికీ నీతికి నీకునీవే ఉద్ధారకుడివి
ఈ స్పృహే నిన్ను మనిషిగా-మనీషిగా-మానవుడిగా నిలబెడుతుంది
అది మరిస్తే అధోగతే
అంబేద్కర్ మాట-చేత-నడత నిన్నుమనిషిగా బతికించే,నడిపించే ధైర్య కిరణాలు
మనిషివై ఆ కిరణాలను గమనించు-కాంక్షించు-స్వీకరించు-ఉపయోగించు
అప్పుడే నీవు కొత్తయుగానికి సూర్యుడవు
ఆయనలా నీవుకూడా మట్టిని చీల్చుకొని పూసి వ్యాపించిన పరిమళానివౌతావు
వల్లభాపురం జనార్దన
9440163687