Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారత్ బంద్ ..భారత్ బంద్
రైతు ప్రజా నిరసన తెలిపే బందూకు
వ్యవసాయ నల్ల చట్టాల రద్దుకోసం
అన్నదాతలు మోగిస్తున్న రణభేరి
అన్నదాతల ఆగ్రహవిశ్వరూపం
చెమట చూపే శాంతకోపం ఫర్మానా
శాంతియుత యుద్ధవ్యూహం
ఉన్న మండలంలోనే అమ్ముకునే వసతిలేని అన్నదాతకు
శీతలీకరణ గోదాముల ఊసే లేని అన్నదాతకు
దేశంలో ఎక్కడైనా అమ్ముకునే హక్కు
రాజ్యం ఇచ్చిన బంపర్ ఆఫర్
అబ్బో!అన్నదాతపై రాజ్యం కురిపించిన ప్రేమ ఎంతగొప్పదో
కార్పొరేట్లతో ఒప్పందం పేరుతో
రైతు చేతులకు బేడీలు వేయడం
మరింత గొప్ప ఆఫర్
ఉన్నబొచ్చె ఊడిపోయేంత గొప్ప ఆఫర్
ఆధిపత్య దాతృతాన్ని పొగడడానికి మాటలు చాలవు
రాయడానికి అక్షరాలు సరిపోవు
కొలమానానికి కొలతలు లేవు
రాస్తారోకోలు-ధర్నాలు-నిరాహారదీక్షలు- బందులు నిర్వహించడం ప్రజాస్వామిక హక్కు
దాన్ని, నేలరాస్తామంటే
హిట్లరిజం వచ్చిందన్నమాటే
భారత్ బంద్ ప్రజల ధర్మాగ్రహ దమ్మును చాటే శాంతియుత అణ్వస్త్రం
శాంతియుత ధిక్కార సాంఘిక చర్య
ప్రజలారా! మేధావులారా! ప్రజా కవులారా!
యువతులారా!మహిళలారా! యువకులారా!విద్యార్థులారా!నిరుద్యోగులారా!
కడలిరండి,కదం కదం కలపండి
మద్దతు తెలపండి
ప్రజాగ్రహాన్ని ప్రకటించండి
జయహో! భారత్ బంద్
(8 డిసెంబర్ న కొత్త వ్యవసాయ నల్ల చట్టాలరద్దు కోసం రైతులు చేస్తున్న భారత బంద్ కు మద్దతుగా)
- వల్లభాపురం జనార్దన
9440163687