Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎండాకాలం వానలాయే...
వానాకాలం ఎండలాయే...
చలికాలం వరదలొచ్చే...
ఏ కాలంల ఎట్లుంటదో...
ఎప్పుడేమైతదో తెల్వకపాయే...!
కష్టేఫలి అన్న మాటింటే నవ్వొచ్చే...
ఆరుగాలం కట్టపడ్డా...
నాభం నేకపాయే...!
ఇత్తు నాటుదమంటే సినుకు జాడ కానరాకపాయే...
ధాన్యం ఆరబోసినేళ నీటిపాలాయే...!
పంట సేతికొచ్చిందంక కంటి మీన కునుకు లేకపాయే...
నాభమేమో మద్దెలోడు గద్దనాగ తన్నకపాయే...!
కట్టపడి పండిచ్చిన పంట...
ధర లేక పారబోసుడాయే...
కన్నబిడ్డోలే సాకిన పంట...
కళ్ళముందే నీటిపాలాయే...!
కొత్త కొత్త చట్టాలాయె...
ఎదిరిస్తే లాఠీచార్జి లాయే...!
ఇట్టయితే ఎట్ట బతకాల్నో అంతు వట్టకపాయే...
పురుగుమందు డబ్బా ఏపు...
సూపులు అతక్కపాయే...!!!
-చంద్రకళ. దీకొండ,
మల్కాజిగిరి,మేడ్చల్ జిల్లా.
9381361384