Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నియంత్రిత సాగు
సన్నరకం వరి సాగంటు
పాలకులు పదే... పదే.....
నొక్కిన సన్నాయినొక్కులు
రైతు రాబడినే తొక్కినాయి
ధర నిర్ణయాధికారమే లేనప్పుడు
దగాకోరు మాటలెందుకు పాలకులారా?
మన్నుపై మమకారం
వెన్నుపై శ్రమభారం
రైతుబతుకే అంధకారం
పాలకులదే ఈపాపకార్యం
దంచికొట్టిన వానలు
మంచుకొచ్చిన వరదలు
పీడించిన చీడలు
పెరిగిన పెట్టుబడి
తరిగిన రాబడి
సన్నరకం వరిసాగుతో
రందిలబడ్డది రైతుబతుకు
గవ్వ రాకడ లేదు
గడియ రికాం లేదు
పాలకులేగిట్లజేసినశీక
రైతుబతుకుకు
రందిగాక యింకేముంటది.
✍️ జినుకల వెంకటేష్
కరీంనగర్
9652092120