Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వంశీ కృష్ణ,95429 32438
ఖమ్మం మెట్టు లో సుబ్బయ్య లక్ష్మమ్మ
ముద్దు బిడ్డడుగా ఇల పైన జన్మించి
రైతు బిడ్డ గా బ్రతికెరా రావెళ్ల భూమి పుత్రుడై ఎదిగెరా
రాచరిక పాలనను తుత్తునియలు సేయ సాయుధా రైతాంగ సమర శంఖం ఊది
నైజాము నెదురించెరా రావెళ్ల ప్రజలకై జీవించరా
దేహమున తూటాలు దిగుతున్న వెరువక
శత్రు సైన్యంబుని తన్ని తరిమేసిన
ఘనమైన ధీశాలిరా రావెళ్ల వీరత్వపు ఖ్యాతిరా
భూతల్లి కోసమై చెరసాల లో మగ్గి
జైలు యందున ఉన్న స్థితులపై కొట్లాడి
మార్పులెన్నో తెచ్చెరా రావెళ్ల తూర్పు కిరణం అయ్యెరా
స్వంత ఇంటినే కవితా కుటీరము చేసుకొని
సాహితీ లోకమున సేవలెన్నో సేసి సూర్యుడిగా ప్రభవిల్లేరా రావెళ్ల ఉషశ్రీగా విరాజిల్లేరా
పల్లె భారతి లో రాగజ్యోతులు నిలిపి
చైతన్య స్రవంతి తో నవ జీవన రాగం పలికిన
ప్రజా కవితా శక్తి రా రావెళ్ల పీడితుల గానమ్మురా
గురజాడ దాశరథి జాషువా సాహిత్య పురస్కారములెన్నో స్వీకరించినట్టి
మధుర కర్షక కవిరా రావెళ్ల
ఎందరికో స్ఫూర్తిరా
'కదనాన శత్రువుల కుత్తుక' ను పాటతో
వీర తెలంగాణా ధీర చరితంబు చాటిన
మహనీయ కవి కాంతిరా రావెళ్ల స్మరణీయమగు శక్తిరా