Authorization
Mon Jan 19, 2015 06:51 pm
✍️ మహేష్ వేల్పుల
తొండ, తిరుమలగిరి, సూర్యాపేట
9951879504
కదన రంగాన దూకిన విప్లవ కెరటం
బానిస బతుకు మనకొద్దురాబై అంటూ
బంధూకు పట్టిన విప్లవ గీతం
రావెళ్లే ఓ చైతన్య గీతం...
వెట్టిచాకిరి పై పిడిగుద్దులు కురిపిస్తూ
వడిసెల రాళ్లు వడివడిగా విసురుతూ
పెత్తందార్లను అడుగడుగున తరుముతూ
వెలుగు బాట వేసింది రావెళ్లే...
నిర్బంధం నన్ను ఆపునా
కుట్ర కుతంత్రాలు భయపెట్టునా
కలంతో ప్రయోగిస్తా అక్షర తూటాలని
పాటలతో గుబులు పుట్టిస్తా దౌర్జన్యానికి
అంటూ కదిలించింది రావెళ్లే...
కలుపు మొక్కలు ఈ రజాకార్లు
కలసి ఏరుదాం, కలిసి నినదిద్దాం
కలిసి నిజాం గద్దెను కూల్చుదాం
అంటూ జనుల్లో చైతన్య స్రవంతిని
కల్గించింది రావెళ్ల వెంకటరామరావు..
నువు వీడిన నిను వీడునా ఈ లోకం
మరవదు కదా నీ గీతం మరవదు కదా
నీ చైతన్య పాఠం స్మరణీయ రావెళ్ల అందుకో మా హృదయపు వందనం...