Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంబటి నారాయణ
నిర్మల్
9849326801
ఈ శతాబ్దం మనుషులు
మనుషుల్లా లేరు!!...
మునుపటి వారిలా
కమ్మగా మాట్లాడరు!!...
నెమ్మదిగా నడుచుకోరు!!...
ప్రపంచీకరణ ప్రభావమో..
లేక మానసికలోపమో...
తెలియని వ్యాపకమో...
మనుషుల్లో మచ్చుకైనా
కానరాని మంచితనం!!....
ఎవరికి వారే హీరోలు!!...
విలువలు తెలియని
అజ్ఞానులు!!...
సంపాదించాలనే తపన!!...
సంపద కన్నా సంస్కారం మిన్న
అనే విషయమే మరిచారు!!..
చేతినిండా డబ్బున్నా...
అనుభవించలేని నిర్భాగ్యులు!!...
స్వార్థంతో స్నేహానికి ముడి వేస్తారు!!..
అసలైన మనిషి తనం
నిఖార్సయిన గుణగణాలలో లేవు!!..
మనిషిలో మంచితనం
పలచబడింది!!..
ఇవే నేటి మనుషుల్లో ఉన్నతీరు!!..
మునుపటి మనుషులు
వెతికినా దొరకరు!!...
మంచితనములోని
కమ్మదనం మరిచిపోయారు!!...
మానవత్వంలోని నిండుతనం..
ఆస్వాదించలేని అభాగ్యులు!!...
ప్రాణంతో సమానమైన
మానమర్యాదల్ని మరిచిపోయారు!!..
అందరూ వశిష్ఠులే కానీ
ఎవరిలోనూ విశిష్ఠత లేదు!!...
కామానికీ ప్రేమకు తేడా తెలియదు!!..
అణువణునా దోపిడీ...
తనువంతా స్వార్థపు రాపిడి...
పదునెక్కిన ఆశల ఒరవడి!!...
ఇప్పుడంతా దుష్టనేపథ్యమే!!..
పైశాచిక ఆనందమే!!...
ఎన్ని విజ్ఞాన ద్వారాలు తెరిస్తేనేమి!!??
ఎంత పరిజ్ఞానం పెరిగితేనేమి!!??
ఇంకా అజ్ఞానాంధకారంలోనే..
మనుగడ సాగిస్తున్నారు!!...
నేటి మనషుల మనసుల్లో
వినమ్రత లేదు!!..
ప్రేమలో పవిత్రత లేదు!!...
నిత్యం తెలియని ఒత్తిళ్ళతో..
అర్థం కాని వ్యసనాలతో...
తమల్ని తాము
ఆవిష్కరించుకుంటారు!!...