Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కట్టు తెగిన సాహిత్య ప్రవాహం కి
మంచి కోసమై తెగించే హృదయం కి
రామలింగడి వంటి హాస్య చాతుర్య పటిమ కి రూపం మన కట్టమంచి రామలింగారెడ్డి
చిత్తూరు జిల్లా లో సుబ్రహ్మణ్యం రెడ్డి నారాయణమ్మ దంపతులకు జన్మించి,
రచయిత హేతువాది ఆదర్శ వాదీ రాజనీతిజ్ఞుడు గా తనదైన ముద్ర వేసిన మంచి మనిషి మన కట్టమంచి
ముసలమ్మా మరణం తో సాహితీ ప్రియుల మనసులు దోచి
ఇంగ్లాండ్ లో కేంబ్రిడ్జి విశ్వ విద్యాలయం లో ఉపన్యాసకుడిగా తన వాగ్దాటి తో ఆంగ్లేయుల మెప్పు పొంది
విద్వాంసుడి గా రైట్ బహుమతి పొందిన కీర్తి మన కట్టమంచి ది
ఆచార్యుడిగా హరిజన పిల్లలకి పాఠశాల ప్రవేశం కోసం కొట్లాడినా
విద్యా శాఖా అధికారి గా ప్రతీ ఊరికి ఒక పాఠశాల అన్న ఉద్యమం నీ ప్రారంభించినా
శాసన సభ్యుడి గా సభ లో జనం కోసం గొంతెత్తినా
అనుక్షణం ప్రజల కోసమే అతని జీవితం
కవితత్త్వ విచారం, వేమన, వ్యాస మంజరి, పంచమి వంటి అనేక రచన లతో కవిగా
కవితా విమర్శ లో విప్లవం తెచ్చిన "విమర్శగ్రేసర చక్రవర్తి"గా పేరు పొందిన వ్యక్తి
జస్టిస్ పార్టీ లో కీలకం గా వ్యవహరించి
ఉపకులపతి గా ఆంధ్రా యూనివర్సిటీ అభివృద్ధి కి కృషి చేసి
విద్యా రాజకీయ సాహితీ రంగాలలో ఎంతో కృషి చేసిన కట్టమంచి గారు సదా స్మరణీయుడు