Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కట్టమంచి రామలింగారెడ్డి గారు ఈయన మేధో సంపదకు మారుపేరు. ప్రపంచoలోని మేధోసంపత్తు అంతా ఆయన మెదడు లోనే ఉన్నదా అన్నంత గొప్పగా ఆయన ముఖవర్చస్సు ఎప్పుడు దేదీప్యమానంగా వెలిగిపోతుంది. ఆయన గొప్ప బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన ప్రతిభావంతుడైన సాహితీవేత్త, విద్యావేత్త పండితుడు, వక్త, రచయిత, హేతువాది, ఆదర్శవాది అన్నింటినీ మించి "ఆంధ్ర భాషా రంజని"లో చురుకైన పాత్ర పోషించాడు. 'బహుముఖ ప్రజ్ఞ' అన్న పదానికి మారుపేరుగా నిలిచిన ఈ వైతాళికుడు బంగారు పతకాన్ని, విధ్వాంసుడు పురస్కారాన్ని, సొంతం చేసుకున్న కట్టమంచి రామలింగారెడ్డి గారు 1880 డిసెంబర్ 10న చిత్తూరు జిల్లాలోని కట్టమంచి గ్రామంలో కట్టమంచి సుబ్రహ్మణ్య రెడ్డి, నారాయణమ్మ దంపతుల ఇంట సరస్వతి దేవి మానస పుత్రునిగా జన్మించారు. చిన్నతనం నుంచి కూడా చక్కని తెలివితేటలతో ఎంతో చురుగ్గా ఉండేవారు.
వీరి విద్యాభ్యాసము మొట్టమొదట మున్సిపల్ స్కూల్లో ప్రారంభమైంది. ప్రతి పరీక్షలోనూ ఉన్నత శ్రేణి సాధించేవారు. చిన్న వయసులోనే భారతాన్ని,రామాయణాన్ని అవలీలగా చదివేవారు. ఉన్నత విద్యాభ్యాసం కోసం మద్రాసువెళ్ళి క్రైస్తవ కళాశాలలో ఉన్నత విద్యను పూర్తి చేశారు. 1899 లోనే "ముసలమ్మ మరణం" అనే లఘు కావ్యాన్ని రచించి 19 సంవత్సరాల అతి చిన్న వయసులోనే ఈ కావ్యానికి పురస్కారాన్ని కూడా అందుకున్నారు ఈ బాల్య సాహితీ ఉద్దండుడు. 1902లో బి.ఏ. పరీక్షలో చరిత్రలో తత్వశాస్త్రంలో అత్యధిక మార్కులతో ఉత్తీర్ణులై బంగారు పతకాలను సొంతం చేసుకున్నారు. ఈ ప్రతిభామూర్తి, చదువులతల్లి ముద్దుబిడ్డ ప్రభుత్వ స్కాలర్షిప్ తో ఇంగ్లండులోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలల్లో చదివి అనేక పురస్కారాలను అందుకున్నారు. 1903లో ఈయన ప్రతిభకు గుర్తింపుగా "రైట్" బహుమతిని అందుకున్నారు. ఇంకా 1904లో "విద్వాంసుడు" పురస్కారాన్ని అందుకున్నారు. 1905లో క్రైమ్ బ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో 'యూనియన్ లిబరల్ కార్యదర్శి'గా ఎన్నికై అక్కడ అనేక ఉపన్యాసాలు ఇచ్చి తన వాక్చాతుర్యంతో ఆంగ్లేయుల మన్ననలు, ప్రశంసలు అందుకున్నారు. ఇంతటి అసాధారణ గౌరవం దక్కించుకున్న భారతీయులలో రామలింగారెడ్డి గారు ప్రథములు. ఈయనలోని వాక్చాతుర్యం, అమోఘమైన విషయ పరిజ్ఞానం, సమయస్ఫూర్తి, హాస్య చతురతకి అక్కడివారంతా ప్రశంసల వర్షం కురిపించేవారు.
ఈ విద్యావేత్త మొదట బరోడా కళాశాలలో ఆచార్యునిగా, ఉపాధ్యక్షుడిగా విధులు నిర్వహించారు. విద్యా వ్యవస్థకు మరింత అధ్యయనం చేయడానికి విధి నిర్వహణలో భాగంగా జపాన్, అమెరికా, ఫిలిప్పీన్స్ దేశాలు పర్యటించి అపారమైన జ్ఞాన సముపార్జన ని సొంతం చేసుకుని చదువుల తల్లి ముద్దు బిడ్డగా కొనియాడ బడ్డారు. ఈ మేధావి విదేశాల నుంచి వచ్చాక మైసూర్ మహారాజు కళాశాలలో ఆచార్యునిగా, ప్రిన్సిపల్ గా, విశ్వవిద్యాలయ రూపకర్తగా విద్యాశాఖాధికారిగా అన్నీ తానై అన్నిటా తానై అనేక పదవులు చేపట్టి బంగారానికి తావి అబ్బినట్లుగా ఆ పదవులకే వన్నె తెచ్చారు. అక్కడ హరిజనులకు అండగా నిలబడి వారి విద్యావ్యాప్తికి ఎంతో కృషి చేసి వారిOదరికీ పాఠశాలలో ప్రవేశం కల్పించి విద్యార్థుల అభిమానాన్ని, గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్ళకి ఆ పదవికి రాజీనామా చేసి రాజకీయ రంగ ప్రవేశం చేశారు.
రాజకీయాల్లో చేరి ఓటర్ల అభిమానాన్ని కూడా సొంతం చేసుకున్నారు. 1922లో చిత్తూర్ లో జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచి శాసనసభలో అడుగు పెట్టారు. మళ్ళీ రెండవసారి ఎమ్మెల్యేగా చిత్తూరు నుండి అత్యధిక మెజార్టీతో గెలిచి సేవలందించారు. కొంతకాలం కౌన్సిల్ సభ్యులుగా ఉన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ తరపున మద్రాసు కౌన్సిల్ కు ఎన్నికయ్యారు. 1936లో చిత్తూరు జిల్లా బోర్డు చైర్మన్ గా విజయవంతంగా విధులు నిర్వహించారు. శాసనసభలో ఆంధ్రులకు కూడా ఒక విశ్వవిద్యాలయం ఉండాలని చెప్పి చక్కని ప్రసంగాలతో అందర్నీ ఆకట్టుకుని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతిగా ఎంతో గొప్పగా విధులు నిర్వహించి విశ్వవిద్యాలయం అభివృకి విశేష కృషి అందరి అభిమానాన్ని చురగోన్నారు.
ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి అటు వృత్తికి, ఇటు ప్రవృత్తికి సమ న్యాయం చేస్తూ ఉద్యోగ ధర్మాన్ని నెరవేర్చడమే విధిగా భావిస్తు రచనలు చేయడం దైవంగా భావించారు. ఆ భావనతోనే సాహితీ రంగంలో సరికొత్త భావాలకు నూతన ప్రక్రియలతో చక్కని విమర్శలకు తన వంతు కృషి చేశారు. ఈ సాహితీ విశ్వంభరుడు ఇటు తెలుగులోనూ అటు తమిళంలోనూ చేయి తిరిగిన రచయితగా గొప్ప గొప్ప రచనలు చేశారు. తెలుగులో భారత అర్థశాస్త్రం, కవిత్వ తత్వ విచారం, వేమన, వ్యాసమంజరి విద్యా ప్రవృత్తి, లఘు పీఠికా సముచ్చయము, నవ యామిని, పంచమి వ్యాసాల సంపుటాలు, దేవీభాగవతము, ముత్యాల సరాలు లాంటి అద్భుతమైన రచనలు చేశారు. అలాగే ఆయన ఆంగ్లంలో కూడా ఉద్దండ పండితులు.
"డ్రామా ఇన్ ది ఈస్ట్ అండ్ వెస్ట్, స్పీచెస్ ఆన్ యూనివర్సిటి రిఫార్ము డెమోక్రసి ఇన్ కాంటెంపరరీ ఇండియా" లాంటి ఎన్నో ఆణిముత్యాల్లాంటి రచనలను కూడా చేసి బ్రిటిష్ వారి అభిమానాన్ని కూడా చూరగొన్నారు.
రామలింగారెడ్డి గారికి ఎంతో ఇష్టమైన పింగళి సూరన రచించిన 'కళాపూర్ణోదయం' అనే ప్రబంధాన్ని విమర్శిస్తూ 'కవిత్వ తత్వ విచారము' అనే మరో గ్రంథంగా వెలువరించారు. ఇది తెలుగులో వచ్చిన తొలి సాహిత్య విమర్శనా గ్రంథంగా వినుతికెక్కింది. ఇందు కలడు అందు లేడు అన్న సందేహం వలదు ఎందెందు వెతికినా కట్టమంచి వారే అన్న చందాన అన్ని రంగాల్లో తనదైన బాణీలో రాణించి విద్యారంగంలో ఈ మేధావి అందించిన సేవలకు గుర్తింపుగా వీరి బంధువు కట్టమంచి జనార్దన్ రెడ్డి గారు "కట్టమంచి విద్యాసంస్థలు" పేరుతో పాఠశాల నడుపుతూ విద్యార్థులందరినీ కట్టమంచి వారి ఆశయాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నారు. ఇంతటి ఘన కీర్తిని సంపాదించుకున్న ఈ ప్రతిభా మూర్తి కట్టమంచి రామలింగారు
-పింగళి భాగ్యలక్ష్మి,
గుంటూరు రచయిత్రి, వ్యాసకర్త,
ఫోన్ : 9704725609.