Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గోకినేని పల్లి ఉద్యమాల గడ్డ పై జన్మించి
సామాజిక పరిస్థితులకు ప్రేరేపితుడే
పేదలకు తన జీవితం
అంకితమిచ్చిన మహనీయుడు
భూమికోసం భుక్తి కోసం
తెలంగాణ జన విముక్తి కోసం
నిరంకుశ పాలనపై
ఉద్యమాన్ని ఉరకలెత్తించి నాయకుడు
పెన్ను పట్టి పోరాడిన కవి యోధుడు
అభ్యుదయ జానపద శైలిలో
అనూహ్యమైన రచనలెన్నో చేసి
విద్యార్థి దశలోనే ఉద్యమాలకు ఆకర్షితుడై
ప్రజలను చైతన్య పరిచి
ఎన్నో కష్టాలకు ఎదు రోడ్డి
జైలు జీవితం గడిపి
హక్కులకోసం పోరాడిన ఉద్యమ ప్రస్థానం రావెళ్ల
గన్ను పట్టి యుద్ధ నైపుణ్యాల్లో ఆరితేరిన ధీరుడు
జన జీవితాలను తన పాటలో సమగ్రంగా చిత్రన చేసిన ఆణిముత్యం
రావెళ్ళ పాటకు జనాలు నీరాజనం
పలికే తెలంగాణ ధీరత్వం
పాటల
తూటాలు పేల్చిన రావెళ్ళ వీరత్వం
అనర్గళంగా మాట్లాడే గొప్ప వాగ్ధాటి రావెళ్ల
పద్య పట్టులో ఎంతో నేర్పు సాధించిన కవనం
కవితా ఖండికలో పల్లె భారతి అనంతల్పం పురాతన్
అత్యంత ప్రాచుర్యం
మధురకవి కర్షక కవిగా బిరుదులను
అలంకరించిన రావెళ్ల
గురజాడ సాహితీ పురస్కారం జాతీయ సాహితీ పురస్కారం అందుకున్న
కవనంభు
వడివడిగా అడుగులు ముందుకు వేసి వెన్ను చూపక పోరు స్వల్పిన
యోధుడు
కదనాన శత్రువుల కుత్తుకల నవలీల అంటూ
కలం నుండి జాలువారిన పాట
తెలంగాణ ఉద్యమ స్వరూపం
కళ్లముందు కదలాడే జీవన చిత్రం
నరనరాన పోరాట స్ఫూర్తిని నింపి
ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలించి
కదనాన శత్రువులు అంటూ
తెలంగాణ వీరత్వాన్ని అక్షరాల్లో రంగరించిన
ఉద్యమాల నేల మన తెలంగాణ
అంటూ
డిసెంబర్ 10న అమరుడైన వీరుడు
నీకు వేల వేల విప్లవాభివందనాలు
అందుకో యోధుడా విప్లవ నివాళి
తెలంగాణలో చిరస్మరణీయుడు
- నెల్లుట్ల సునీత