Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మానవ హక్కులు ఐక్యరాజ్య సమితిలో
మన రాజ్యాంగంలో
పదిలంగా ఉన్నయి
నాయకుల ఉపన్యాసాలలో
బల్లగుద్దుతున్నయి
ప్రచార ప్రసార హోర్డింగులలో
బోర్డింగు తీసుకుంటున్నయి
రైతుల ప్రభుత్వ మధ్యవర్తి చర్చల్లో
ప్రభుత్వ వ్యాఖ్యాన విన్యాసంలో
పరిమళిస్తున్నయి
హక్కుల రక్షణ కవచాలు పగులగొట్టబడి
కర్ణుల జనాభా
లెక్కలు చూపిస్తున్నయి
ప్రచారంలో అగ్రస్థానం
ఆచరణలో అధమాధమస్థానం
సిద్దాంతంగా పూచీ
ఆచరణలో పేచీ
సిద్ధాంత నిర్మాణానికి చిన్నయసూరి
ఆచరణ వ్యాఖ్యానానికి మల్లినాథ సూరి
ఇదీ మన ప్రజాస్వామ్య మానవ హక్కుల ప్రస్తాన భేరి
నిజాన్ని నిర్భయంగా చెప్పే నోళ్ళకు
తాళాలు బిగించే ప్రక్రియలో
రక్షణ ప్రస్థానం నిరాఘాటం
అక్షరాల నేరమేంటో
తే ల్చకుండానే
ఏళ్లకేళ్ళు జైళ్ళలో మగ్గేలా చేయడమే
హక్కుల సంరక్షణకు అసలు సిసలు జవాబుదారీతనం
హక్కులకోసం
నినదిస్తే దేశ ద్రోహులు
రైతు బతుకు చంపే చట్టాలను
రద్దుచేయమనే వాళ్ళు రైతులే కారనే తీర్మానంతో
మానవ హక్కుల సంరక్షకులుగా
పాలక సత్య హరిశ్చంద్ర జనాభా బుకాయింపులు
మానవ హక్కుల సంరక్షణలో పోషణలో నిర్వహణలో
అగ్రగాములుగా పోజులు
ఇదీ నడుస్తున్న ప్రజాస్వామ్యాల తీరు
అయినా హక్కులు నిల్పుకొనే పోరు బాట ఆగదు
*అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం యాదిలో
- వల్లభాపురం జనార్దన
9440163687