Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హక్కు ల కై ఆరాటం
సాక్షిత్కరించే ఎందరో
.త్యాగాల పునాదుల పై
ఉద్యమాల సమీదలపై
ఐక్యరాజ్య సమితి విశ్వమానవుల సహజ స్వేచ్చల కై డిసెంబర్ 10,1948 లో ప్రకటితం అయ్యే
సామాజిక అసమానతలు,వర్ణవివక్షలు,జాత్యాంకారాలు సమాధి చేసి ప్రాణారక్షణ ,పని హక్కు ,ఆహారం పొందే హక్కు ఆర్ధిక సాంఘిక సహజ సౌబ్రాతృత్వాల కల్పనే ద్యేయం ఈ హక్కులు
అంబేద్కర్ మానస పుత్రిక రాజ్యాంగం లో ప్రాథమిక హక్కుల ప్రోది కి ప్రేరణ
అగ్రరాజ్యం అమెరికా కనుసన్నుల్లో నడిచే ట్రాంప్ తెంపరి తనం తో నల్ల జాతీయుల పై దాడులు అగునా బెడెన్ తో నైనా ఆకలి కేకలా ముందు హక్కుల సారాంశం శూన్యం
భూస్వామ్య వ్యవస్థ,రాజరిక వ్యవస్థలు పోయిన పర్యాయ వ్యవస్థలో ఇంకా అసమానతలు జనిస్తూనే ఉన్నాయి
లింగ వివక్ష గజ్జెకట్టి ఆడుతుంది
వర్ణ వివక్ష బుస కొడుతోంది
బాలల హక్కులు కుక్కిన పెనుల పాడిఉన్నాయి
రైతులు మద్దుతూ ధర కోసం రోడ్డెక్కి కింకాయిర్యాలు చేస్తూనే ఉన్నాడు..ఉరికొయ్యల పాలు అవుతూనే ఉన్నాడు
కులం రాక్షశి నల్ల నాగుల బుస కొడుతూనే ఉంది
సామాన్యాయ పాలన అటుకెక్కింది
రాజ్యాంగ పరి రక్షణాలు
ప్రతిబింబాలు గా మిగిలి పొయ్యాయి
ఆర్ధిక సమానత్వం లేని రాజకీయ సమానత్వం మిథ్య
మనిషి ఆలోచనలోనే సమస్యకు పరిష్కారం ఉంది
ప్రపంచ పౌరులరా చేతనం దీప్తులు కావాలి
బాధ్యతగా హక్కైలకై పోరాటం చెయ్యాలి
అచేతనం వీడు చేతనం వైపు సాగు అప్పుడే హక్కుల కు మిగులు అర్థం
- ఉమశేషారావు వైద్య
లెక్చరర్ ఇన్ పొలిటికల్ సైన్స్ దోమకొండ,కామారెడ్డి జిల్లా
సెల్.9440408080