Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్వలాభాపేక్ష డేగ కన్ను వ్యాపార రాజకీయం వ్యవసాయ రంగం పై పడింది..
కార్పోరేట్ల ప్రయోజనం కోసం
కూర్చున్న కొమ్మనే నరుక్కునే చందంగా మారింది..
కిరాయికి ఆశ పడి అన్నదాత కష్టాన్ని
పరాయి పాలు చేయడానికి చేతులు కలుపుతున్న
మన నేతల మేధావితనం చూసి
నేల కూడా నివ్వెరపోతోంది..
ఆకలి తీర్చే కర్షక కరాలు
ఆపన్న హస్తం కోసం అర్రులు చాచే దుస్థితికి దిగజారకముందే..
మనమంతా సంఘీభావంతో పిడికిలి బిగిద్దాం..రండి!
ఆ సేతు హిమాచలం సైతం పిక్కటిల్లేలా గర్జిద్దాం..
మట్టిని నమ్ముకున్న రైతన్నపై
ఆధిపత్యాన్ని చెలాయించేవారు
మట్టిపాలు కాక తప్పదని గట్టిగా హెచ్చరిద్దాం..
నిత్య కృషీవరుల శ్రమని తాకట్టు పెట్టి..
సొమ్ము చేసుకోవాలనుకున్న రాజకీయ ద్రోహుల గుండెలో ఉద్యమ నగారా మోగిద్దాం..!
- సుజాత.పి.వి.ఎల్.
సైనిక్ పురి, సికిందరాబాద్.
7780153709.