Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొన్నివాస్తవాలను
వెలికితీయడానికి
నిత్యం ప్రయత్నం చేస్తున్నా!!...
తవ్వకాల్లో
ఏదో అడ్డుపడింది!!..
కళ్ళుమూసి
దారి తప్పిస్తోంది!!...
పెన్నుతో మీటితే...
బయటపడలేదు!!..
గునపాలతో తవ్వినా...
గుట్టు బయటికి రాలేదు!!...
నిజమైన చారిత్రక సత్యం
బయటికి రావాలంటే...
కొంత ప్రయత్నం అవసరం!!..
ఓ విశిష్టమైన విధానంలో..
ఓ పటిష్టమైన పట్టుదలతో..
నైతికసూత్రాలతో..
నిజమైన విలువలతో..
అందరిలోఉన్న అజ్ఞానాన్ని
తరిమికొడుదాం!!..
ఎన్నోసంఘటనలతో
అల్లుకొన్నది..
ఎన్నోనిజాలతో
కూడుకున్నది..
ఈ సమాజం నాకెప్పుడు
ఓ సజీవ శిల్పమే!!...
అందరికీ ఓ
వినియోగ వస్తువే..
ఓ అవసరమైన వస్తువే!!...
ఈ విశాలవిశ్వం
సమస్త మానవవశం!!..
లోచూపు ఉంటే అన్నీవశమే!!..
చూసే చూపులో
హృదయముండాలి!!...
ప్రతి స్పందనలో మనసుఉండాలి!!..
జగతిని జాగృతంచేసే
వయసుఉండాలి!!...
శక్తి ఈ సమాజంలోఉంది!!..
ఈ వ్యవస్థ పొత్తిళ్ళలో..
పాతుకుపోయిన
సాధనతోనే సత్యం
అడ్డదారులను మూసేద్దాం!!...
దొడ్డిదారుల దొంగలను కట్టేద్దాం!!..
నిత్యం చూస్తోన్న దృశ్యాలన్నీ
అంతరంగాల్ని తాకేటివే!!...
అందమైన అనుభూతులు
అంతటా నిండుగా ఉంటాయి!!...
మనిషికి మనిషికి మధ్య
అంతరాలుపెరుగుతున్నాయి!!...
పైపై కొత్త మెరుగులద్ది
ప్రలోభాలకు దారి తీస్తారు!!...
నమ్మిన నిజాన్ని నట్టేట్లో వదిలేస్తారు!!..
అందుకే తవ్వాలి..బయటికి తీయాలి!!..
జీవితంలో మరిచిపోని
గుణపాఠం చెప్పాలి!!...
- అంబటి నారాయణ
నిర్మల్
9849326801