Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎక్కడోపుట్టి
విధినిర్వహణకై
తెలుగుగడ్డపై అడుగెట్టి
అచంచలమైన ఆత్మవిశ్వాసంతో
చేపట్టిన పదవికి వన్నెతెచ్చేందుకు
పరిపాలన సౌలభ్యం
ప్రజల సమస్యల పరిష్కారానికై పట్టువిడవక
అజంతభాషను నేర్చుకున్న బహుభాషలమేధావి సి.పి.బ్రౌన్ మహాశయుడు
కోదండరామపంతులు బోధనలో లీనమై
తెలుగుభాషలోని సొగసును తన అంతరంగంలో శాశ్వతంగా ముద్రించుకున్న
భాషాభిమాని బ్రౌన్
ప్రాచీన చరితగల తెలుగువెలుగులను వెలికితీసీ
జగతికంత పరిచయం చేసిన భాషాసంస్కారి బ్రౌన్
అంతరించిపోతున్న
ప్రాచీనగ్రంథాల బూజుదులిపి
సరికొత్తగా పరిచయంచేసిన తెలుగుకువెలుగు బ్రౌన్
నేడు తెలుగుభాషను నిలబెట్టిన తెలుగువారందరికి ఆదర్శనీయుడు బ్రౌన్
ఆయనచేసిన సేవ అజరామరం ఆచరణీయం
నీ సేవలకు ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం
తెలుగుభాష గౌరవం కాపాడడమే
నీవు చేసిన సేవలో మేమంత
భాగస్వాములమై
తెలుగుభాషను నిలబెట్టినచాలు
నీ సేవకు మేమిచ్చే గౌరవం
తెలుగుభాష పుడమిపై వున్నంతకాలం మా మదిలో శాశ్వతుడవేనోయి బ్రౌన్ దొర
సి. శేఖర్(సియస్సార్)
పాలమూరు,
9010480557.