Authorization
Wed April 02, 2025 02:31:10 am
పసిడి పంటలు
పండించే భూమి
రసాయనాల రణభూమిగా మారకూడదనే
రైతుల పోరాటం
పచ్చదనంతో పరవశిస్తున్న
పుడమి తల్లి
రక్కసుల పాలై
రాళ్లభూమిగా మారకూడదనే రైతుల పోరాటం
" అన్నం కూడా
విలాసవస్తువై" వున్నోడే తినాలి..
లేనోడు ఆకలితో చావాలనే పరిస్థితులు రాకూడదనే
రైతుల పోరాటం.
వ్యవసాయ పనులమీదే బ్రతుకుతున్న
పల్లెజనం బ్రతుకులు
బజారుపాలు కాకూడదనే
రైతుల పోరాటం
తినే తిండి, తాగేనీరు
రసాయనాల సమ్మిళితమై మనుషులు జీవచ్ఛవాలుగా
మారకూడదనే
రైతుల పోరాటం
శ్రమైకజీవనసౌందర్యానికి తర్కాణమైన వ్యవసాయం
బానిసత్వంగా మారకూడదనే
రైతుల పోరాటం
పండించినగింజలనెత్తుకొని అమ్మకంకోసం రాష్ట్రాలరహదారులపై
బికారిగా తిరగకూడదనే
రైతుల పోరాటం
అన్నదాతల ఆరుగాలం
శ్రమంతా కార్పొరేట్
శీతలగిడ్డంగుల్లో మూలుగుతుంటే
తిండిలేక ప్రజలు చావకూడదనే
రైతుల పోరాటం
కాంట్రాక్టు ఉద్యోగి
ప్రవేటు ఉద్యోగుల్లా
రైతులు కూడా " కాంట్రాక్టు రైతు" ప్రవేటు రైతు " కాకూడదనే
రైతుల పోరాటం
యుగయుగాలుగా
తరతరాలుగా
దేశ సంపదను పెంచుతున్న వ్యవసాయం విదేశీశక్తుల విషహస్తాల్లో చావకూడదనే
రైతుల పోరాటం
✍ కె. నిర్మలకుమారి
ఖమ్మం
9652395184