Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎవరో!!??..ఎవరెవరో!!???...
ఎవరికీ అర్థం కాని వారెవరో!!??...
వచ్చిపోయే దారిలో
ఎవరెవరో వస్తూపోతుంటారు!!...
అందరూ మనవారు కారు!!....
ఎప్పుడు పడితే అప్పుడు...
ఎక్కడ పడితే అక్కడ....
నడక వచ్చినోళ్లు..
ఒడుపు తెలిసినోళ్లు..
ముడుపు కట్టేవాళ్ళు..
మడత బెట్టి మాట్లాడుతారు!!...
మలుపులను చూసి మార్చేస్తారు!!...
మనుషులను చూసి
అంచనా వేస్తారు!!..
బాటలను చీల్చుతారు!!..
బతుకులను ఒల్చుతారు!!..
బాధలను నింపుతారు!!..
మేజిక్కు...కనికట్టు
లాజిక్కులెన్నో చేస్తారు!!...
మస్తిష్కంలో విషం...
మనసులో కుబుసం...
నింపుకొంటారు!!...
మనిషి సమస్తం
సుళ్ళు తిరిగే కుళ్ళు!!...
ఎంత తోడినా తరగదు!!....
మనిషి మనసు లోతైంది...
ఎవరికీ అర్థం కాదు!!....
అదో నిగూఢ జనారణ్యం!!...
నిరంతర కెరటాలసాగరం!!...
కంటిపాపను కమ్మేసిన
కన్నీటి బిందువులు...
కనిపించే ప్రతి ఒక్కరిలోపాలు!!...
మనసులోని తాపాలు..
మనుషుల వింత రూపాలు...
సంకుచిత కేళి...
వికృతవిన్యాసాల ర్యాలి!!...
చూద్దామని...ఏదో చేద్దామని...
మోసాలు...ముసుగు మాటలు
కల్లబొల్లి మాటలతో
కాలంతో కట్టేస్తున్నారు!!...
నిమిషానికో విషమ పరీక్ష!!..
చితికి పోతున్న
సామాన్యుల జీవితాలు!!...
విసిగిపోతున్న జనహృదయాలు!!...
మనిషికి మనిషే ఓ పరీక్ష!!...
ఎత్తులతో చిత్తు చేసేది మనిషే!!....
విషమ కాలుష్యంలా..
కబళించేదీ మనిషే!!...
ఎప్పటికీ...ఎవరికీ
అర్థం కానిది మనిషే!!...
ప్రపంచమే మనిషి!!...
ప్రపంచాన్ని
మోసం చేసేదీ మనిషే!!...
మనిషే మనిషికి ఓ సమస్య!!..
అంబటి నారాయణ
నిర్మల్
9849326801