Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెరువు గట్టున
కొంగ
ఒంటి కాలిపై తపస్సు చేస్తూ ఉంది
చేపల్ని
తినటానికి కాదు
కాపాడటానికట
చెట్టు పైకి
పాము
బిర బిరా పాకుతూ ఉంది
పక్షి గ్రుడ్లని
ఆరగించటానికి కాదు
సంరక్షించటానికట
నీటి మరుగున
మొసలి
కాపు కాస్తూ వుంది
లేడి పిల్లల్ని దిగమింగటానికి కాదు
ఉద్దరించటానికట
చీకటి
తెరలు తొలగుతున్నాయి
బ్రమల
పూలు రాలుతున్నాయి
చేపలు..పక్షులు... లేడిపిల్లలు
వేటగాళ్ల
నగ్నత్వాన్ని గ్రహిస్తున్నాయి
మూకుమ్మడిగా
హస్తిన వైపు సాగుతున్నాయి
.....బత్తుల శ్రీనివాసులు