Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనం మాట్లాడే ప్రతి మాటా..
గుండె నుండే రావాలి!!
ఆ గుండె నిండా..
ప్రేమ ఉండాలి!!..
ఆ ప్రేమ
నిండైన మనసుదై ఉండాలి!!..
ఆ మనసునిండా
మమకారముండాలి!!...
దానికి ఓదార్చే
గుణముండాలి!!...
ఓపికగా వినే...
ఓర్పు ఉండాలి!!...
కూలిపోయే బతుకుల్ని..
రాలిపోయే జీవితాల్ని..
మాటతోనే నిలబెట్టాలి!!...
మనసుతో ప్రాణం పోయాలి!!...
మాటకున్న శక్తి..యుక్తి
అనంతం!!
మాట ఒక తూటాగా మారి
ప్రాణం తీయనూ గలదు!!...
ప్రాణం పోయనూ గలదు!!..
యుగాల తరబడి మాటనే
శాశ్వతంగా నిలబడింది!!
మాట అదుపుతప్పితే...
అగ్నిమంటై దహిస్తుంది!!..
మంచిమాటే చేయూతగా మారి జీవితాల్ని నిలబడుతుంది!!...
మనిషి మనసు
తలుపులు తెరవాలన్నా...
గుండెలను బద్దలు
కొట్టాలన్నా మాటే మార్గం!!...
ప్రేమను పంచాలన్నా..
ప్రేమను తుంచాలన్నా...
మాటనే దానికి కారణం!!...
మాట మనిషికి ఓ వరం!!..
మాట మనిషికి ఓ చక్కని బాట!!
అపుడపుడు ఉరుమే ఉరుములా...
మెరిసే మెరుపులా...కనికరిస్తూ
కన్నీరు తెప్పిస్తుందీ మాట!!....
ఏదైనా మాటలతోనే కదా తెలిసేది!!...
పరిధిని దాటని మాటలే
మనుషులను అర్థం చేసుకునేలా.. మనసుల్ని దరిచేరేలా చేస్తుంది!!
బతుకు నడకకు మాటనే పునాది!!...
మనిషిలో నిత్యం
మొలకెత్తే ప్రతిమాటా...
ఫలిస్తే ఓ సృష్టి!!....
లోతుగా దర్శిస్తే..
వినూత్న దృష్టి!!...
గుండెలోతుల్లో ఎగిసే...
జ్వాలారుధిరం!!...
మనిషి మనుగడకు
మాటే కదా మూలాధారం!!...
అంబటి నారాయణ
నిర్మల్
9849326801