Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశ సౌభాగ్యం కొరకు తమ ప్రాణాలనే బలిదానం చేసిన మహా పురుషులలో పొట్టి శ్రీరాములు గారొకరు. క్రీ. శ.1901, మార్చి 16న. మద్రాసులో గురవయ్య, మహాలక్ష్మ మ్మ లకు జన్మించారు. ముద్దు బిడ్డడే శ్రీరాములు. ఆయన విద్యాభ్యాసం కూడా మద్రాసులోనే జరిగినది. ఆపై బొంబాయిలో శానీటరీ విద్యానభ్యసించేను. పిమ్మట గ్రేట్ ఇండియన్ పెనిన్యూసులరైల్వె ఆఫీస్ లో ఉద్యోగం చేశారు. అంతలో ఆయనకు భార్యావియోగం సంభవించేను దానితో ఆయనకు ఐ హిక సుఖాలపై విరక్తి కలిగెను. ఇరవై సంవత్సరలైన నిండక మునుపే భార్యను కోల్పోయిన శ్రీరాములు మరల వివాహమాడక తన జీవితమును దేశసేవకు అంకిత మీచ్చెను. ''పట్టు మని పది మంది శ్రీరాములు వంటి మహా వ్యక్తులున్నచో మన దేశానికీ సంవత్సరకాలంలో స్వతంత్య్రంను సంపాదించవచ్చు'' నని గాంధీ మహాత్ముడు సబర్మతి ఆశ్రమంలో అనినాడట. దేశభక్తి లోనూ, త్యాగశిలంలోనూ తన సిద్ధాంతంనకు ప్రతిరూపంగా నిలిచినవాడు.
శ్రీరాములను గాంధీ ఎంతో కొనియాడెను. ఆ. మెప్పే ఆయనకు వేయి ఏ నుగుల బలమై జాతియోద్యమంలోనూ, హరిజన సేవా కార్యక్రమం లోనూ పురోగమింప జేసినది.
తన ఆశయ సిద్ధికి శ్రీరాములు మూతక బట్టలు ధరించి హరిజనోద్ధారణ నినాదాలు గల అట్టలను మెడకు తగిలించుకొని ఎప్పుడూ ఊరు వాడా తిరుగుచు ప్రచారం చేసేవాడు. ఆయన. దేశ సేవకు అంకిత మైన నిస్వార్ధ జీవి. 1947లో మన. దేశానికీ స్వతంత్య్రం సిద్దించిన పిమ్మట ఆంధ్ర రాష్ట్రము కావాలని ఆంధ్రులు కోరిరి, కానీ, ప్రభుత్వమందులకు అంగీకరించలేదు. 1952 అక్టోబరు 19న మైలాపూరు లోని బులుసు సాంబమూర్తి గృహంలో ఆంధ్ర రాష్ట్ర సిద్ధికై శ్రీరాములు నిరసన వ్రతం ప్రారంభించేను. ఉపవాసలతో ఆయన శరీరం కృశించి, నీరసం హెచ్చి మైకం కమ్మింది. కానీ, ప్రభుత్వంలో ఎట్టి మార్పు కనిపించలేదు. స్పృహలేని సమయాన వ్రతభంగానికి పాల్పడవద్దని మిత్రులకు హేచరించి స్పృహ కోల్పోయెను. నోటి నుంచి రక్తం స్రవించేను. తుద 58రోజుల నిరసన వ్రతానంతరం 1952 డిసెంబర్ 15న పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర సిద్ధికై అమరజీవి అయ్యెను. ఆయన. మరణానంతరం ప్రభుత్వం
రాష్ట్రద్యమంలోని పరమార్ధమును గుర్తించి 1953 అక్టోబరు 1న కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రము
ప్రకటించబడినది. ఆ. పై భాషా ప్రయుక్త రాష్ట్రా లేర్పడి 1956 నవంబరు 1న ఆంధ్రప్రదేశ్ ఏర్పడినది.
ఆంధ్ర. రాష్ట్రా సాధకుడుగా పొట్టి శ్రీరాములు ఘనకీర్తిని ఘడించి, అమరజీవియై మిగిలాడు.
ఆళ్ల. నాగేశ్వరరావు
గుంటూరు, ఆంధ్రప్రదేశ్
7416638823