Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తరతరాల దారిద్ర్యాన్ని
దశాబ్దాలుగా నమ్ముకొని
ఊరి బయట బతుకుతోన్న
చరిత్ర కందని సీస కమ్మరుల
వాస్తవ జీవితగాథల్లోకి
తొంగిచూస్తే!!....
కాలం కాటేసిన...
మనుష్యులు వీరు!!..
సాటి మనుష్యులకు..
దూరంగా బ్రతికేస్తున్నారు!!...
గడ్డ కట్టించే చలిలోను...
రోళ్ళు పగిలే ఎండల్లోనూ..
గుట్టుచప్పుడు కాకుండా..
చిరుగుల బొంతనే కప్పేసుకుంటూ క్షణక్షణం తల్లడిల్లుపోతుంటరు!!..
ఏ జన్మలో ఏతప్పు చేశారోగాని...
ఈ జన్మలో ఇలా నిత్యం
నలుగుతూ వీధినపడ్డ బతుకులివి!!...
దిక్కుమొక్కులేని ప్రాణాలివి!!...
ఏళ్లు గడిచినా...
ఈ వంచన చేసే మనుషుల
మధ్య గెలవలేక...
కడుపునిండా...
తిండికి కూడా నోచుకోక..
గూడు లేక గుడ్డలేక..
సమాజానికి అక్కరకురాని
అంతరించిపోతున్న బతుకులివి!!..
వారి మనోవల్మీకాన్ని
తట్టే వారెవరూ లేరు!!...
ఆ గుండె గుప్పిట్లో ఉన్న
మాటను వినే నాధుడే లేరు!!...
చీకటి ముసుగులోనే సాగే బండబారిపోయిన బతుకులివి!!..
నేడు వారి వారసత్వపు వృత్తి
వాగులో కలిసిపోయినవి!!..
బాసటగా నిలుస్తాయనుకున్న
కులవృత్తులు కూలిపోయినవి!!.. జీవితమంతా విషాదమే
ఏదో గోనే బొంత గూడు కట్టుకొని జీవిస్తున్నారు!!..
దిక్కుతోచని స్థితిలో..
వెర్రిచూపులు చూస్తూ...
విలవిల కొట్టుకొంటున్నారు!!...
రాలిపోయిన ఆశలతో
నిరంతరం వంచింపబడుతునే ఉన్నారు!!... సాటివారిలో మంచినే చూస్తూ... అన్యాయం పాలవుతున్నారు!!...
ఓ పక్క బ్రహ్మ చెముడు డొంకలు...
మరోపక్క ఉత్తేరేణి లొంకలు...
చుట్టూ మురికాల్వల మధ్యనే కదా...
ఈ సీసకమ్మరి జీవితాలు!!...
రాజకీయ చదరంగంలో
వీరెప్పుడూ...
అందలపు చిరుమెట్లే!!...
సీస కమ్మరులకెపుడూ..
తప్పని దుస్థితే!!
ఓట్లనాడే...
ఓదార్పు నెపంతో దరిచేరి...
పబ్బం గడిచాక..
దూరంగా నెట్టేయబడుతారు...
కాస్తయినా దయ చూపండి!!...
మీలో ఒకరిగా కాకున్నా...
ఓటువిలువ...
ఎన్నటికీ తెలుసుకోలేని...
ఈ అమాయక దీనులను కనికరించండి!!
అంబటి నారాయణ
నిర్మల్
9849326801