Authorization
Thu April 03, 2025 02:12:30 pm
హైదరాబాద్ : దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. వైద్యఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులిటెన్ ప్రకారం గడిచిన 24గంటల్లో దేశంలో కొత్తగా మరో 24,010 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 355 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 99,56,558కు చేరింది. ఇందులో 3,22,366 కేసులు యాక్టివ్గా ఉండగా, 94,89,740 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో ఇప్పటి వరకు 1,44,451 మంది కరోనా వల్ల మరణించారు.