Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాళ్ళు పిల్లలుగా ఉన్నప్పుడు
నాన్న సాయంత్రం ఏమి తెస్తాడో
ఇంటి కెళ్లే సరికి అమ్మ ఏమి
తాయిలం చేసి దాసి పెడుతుందోనని
కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూసే వాళ్ళు!
నాన్న తెచ్చిన వాటిని తింటూ
అమ్మ చేసి దాచి పెట్టి పెట్టిన
తాయిలాన్ని రుచి చేసేప్పుడు
వాళ్ల కళ్ళల్లో కన్పించిన మెరుపులాంటి కాంతి
మా కింకా బాగా గుర్తుంది!
వాళ్ళు పెరిగి పెద్దయ్యారు
ఇప్పుడు మేం వాళ్లకి పెద్ద. పిల్లల మాయ్యాము
కూతురే కోడ లై
అల్లుడే కొడుకైనా వేళ
అల్లుడు సాయంత్రం వస్తూ వస్తూ ఎం తెస్తాడో నని
కూతురు మధ్యాహ్నణం ఏమి చేసి పెడ్తుందోనని
నిరీక్షించే పనిలో మేమున్నామి పు డు!
సాయంత్రం అల్లుడు తెచ్చినదానిని
కూతురు చేసి దాచి పెట్టి పెట్టిన తాయిలాన్ని తింటున్నప్పుడు
మా కళ్ళలో మెరిసే కాంతిని
ఇప్పుడు వాళ్ళు వీక్షిస్తున్నారు!
పిల్లలు పెద్దయ్యారు పెద్దలం పిల్లలమయ్యం
ఆప్యాయతాను రాగా లే చేతులు మారాయి
నిరీక్షించడం మాత్రం తప్పని సరైంది!
ఆళ్ల. నాగేశ్వరరావు
గుంటూరు, ఆంధ్రప్రదేశ్
7416638823