Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: రైతుల పాలిట మృత్యు ఘంటలు మోగిస్తున్న వ్యవసాయ చట్టాలను రచయితలు, కవులుగా మనం స్పందించాలని తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర అధ్యక్షులు గాజోజు నాగభూషణం అన్నారు. హైదరాబాద్ లో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో భావస్వరూప్యం గల 20 సాహితి సంఘాల ఆధ్వర్యంలో హలాలకు మద్దతుగా నిర్వహించిన కవిసమ్మేళనంలో తెరసం అధ్యక్షులు నాళేశ్వరం శంకరం మాట్లాడుతూ విద్యా,వైద్యం ప్రైవేటీకరణ అయింది కానీ నేడు ఈ చట్టాలతో వ్యవసాయం కూడా ప్రైవేటీకరణ అవుతుందని అన్నారు. దేశానికి ప్రథమపౌరుడు రైతే అని శంకరం అన్నారు. తెలంగాణ సాహితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఆనందాచారి మాట్లాడుతూ సాధారణంగా రైతు ఇప్పటివరకు అర్థించే పరిస్థితిలో ఉన్నారు. కానీ మన కళ్లముందు ఇలాంటి ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్న రైతన్నలు గర్జిస్తూ చేస్తున్న గొప్ప ఉద్యమం అని అన్నారు. భగత్ సింగ్ వారసత్వంగా సాగుతున్న ఈ ఉద్యమం కేవలం రైతుదే కాదు . యావత్ దేశానిది. అని అలాంటి హలాలకు మనం కలం దన్ను ఇద్దాం అని అన్నారు. అరసం రాష్ట్ర అధ్యక్షులు రాపోలు సుదర్శన్ మాట్లాడుతూ కార్పొరేట్ అనుకూలంగా ఉన్న కేంద్రం రైతుల ప్రాణాలు పోతున్న చూడటం లేదన్నారు. ప్రజా వాగ్గేయకారులు గద్దర్ మాట్లాడుతూ రైతులకు మద్దతుగా సంఘటితమైన సంఘాలు ఐక్యంగా కార్యచరణ ఉంటే బాగుంటుందన్నారు. ప్రముఖ కాలమిస్ట్ సజయ మాట్లాడుతూ ప్రపంచంలో ప్రతి ఒకరికి వ్యవసాయంతో సంబంధం ఉంది. ఒకప్పుడు వరి చెట్లు అంటే నవ్వే వారు. కానీ ఈ చట్టాలను చూస్తే అదే పరిస్థితి వస్తుంది. రైతు అంటే కేవలం మగవారే కాదు.. మహిళలున్నారు. హర్యాలి ముస్లిం రచయితల వేదిక అధ్యక్షులు స్కైబాబ మాట్లాడుతూ.. గత సంవత్సరం షాహిన్ బాగ్ ఉద్యమం నడిచింది. ఇప్పుడు రైతు ఉద్యమం నడుస్తోందని తెలిపారు. రాజ్యం క్రమంగా ఒక్కొక్క రంగాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తోంది. ఆ ప్రమాదాన్ని మనమందరం ప్రతిఘటించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రచయితల వేదిక, సింగిడి రచయితల సంఘం, తెలంగాణ రచయితల సంఘం, తెలంగాణ సాహితి, కవిసంగమం, హర్యాలి ముస్లిం రచయితల వేదిక, అభ్యుదయ రచయితల సంఘం, ప్రజాస్వామిక రచయిత్రుల సంఘం, బహుజనం సాంస్కృతిక వేదిక, పూలే అంబేద్కర్ అధ్యయన వేదిక, ఉనికి సామాజిక సాంస్కృతిక వేదిక, తెలంగాణ చైతన్య సాహితి, బహుజన సాహిత్య కచ్చీరు, బహుజన రచయితల వేదిక, తెలంగాణ సామాజిక రచయితల సంఘం, నెలపొడుపు సాహిత్య సాంస్కృతిక వేదిక, జంబూ సాహితి, బహుజని సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.