Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మిత్రమా!!...
మనం నిన్న చెప్పుకున్న
విషయాలెన్నో కలల్లోకి వచ్చి..
ధైర్యమనే దుప్పటిని కప్పి..
మానసిక ఇక్కట్లను దూరం చేసినవి!!...
మన ఆత్మీయతను చూస్తేనే...
ఆకలి దప్పులు
దూరమవుతాయి!!...
ప్రేమను పంచే...
ఆత్మీయతను హారంగా
నా మెడలో వేస్తావు!!...
కమ్మని మాటలతో...
నమ్మకాన్ని కలిగిస్తావు!!...
కళ్ళలో సుడులు తిరిగే
చెమ్మను రప్పిస్తావు!!...
మొక్కవోని ధైర్యాన్ని నింపి...
మొఖం పైన నవ్వులు కురిపిస్తావు!!....
ఎన్నెన్నో ఒడుదొడుకుల
మెట్లెక్కినోళ్లం!!...
బతుకు ఇరుసుకు కందెనై...
కుటుంబాలను మోసే
ఇరుసు క్రింద పడకుండా...
రాసుకు పూసుకు తిరిగినోళ్లం!!..
ఎన్నెన్నో తప్పులను..
ఏలెత్తి చూపినోళ్లం!!...
ఈ వ్యవస్థ గురించి..
నిత్యం ఆలోచించేటోళ్లం!!...
నిద్రపోతున్న..
వేకువను లేపి..
ఉలిక్కిపడే చీకటిని...
తరిమినోళ్లం!!..
కొందరు మనుషులు
చేసినతప్పిదాలకు..
కొందరి జీవితాలు
కూలిపోయినవి!!..
అబద్దాలను అద్భుతంగా
ఆవిష్కరించే అంచులమీద..
కొత్త స్పందనలో
గుండెబద్దలు కొట్టుకుంటూ..
బలమైన పదబంధాలతో
బతుకు చిత్రాలను నిలిపినోళ్లం!!..
మనసులో దిద్దుకున్న
రంగురంగుల స్వప్నాలు...
ఎన్నెన్నో రూపాలై..
తిరుగుతున్నాయి!!...
బాల్యం నుంచే బ్రతుకాక్షరాలు నేర్చుకునోళ్లం!!...
ఎవరికీ కనిపించని
ప్రతిబింబం..
ఎవరికీ వినిపించని శబ్దం
మనలోఉంది!!...
అందుకే నిశ్శబ్దాన్ని
ఛేదించి ముందుకు
నడుస్తున్నాం!!...
వెన్నెలలో మనమే!!...
చీకట్లోనూ మనమే!!..
ఇప్పుడూ..ఎప్పుడూ
తప్పనిసాగే నడక..నడత
మనదే!!...
లోకానికి ఎరుక చేయడానికే
మన కలయిక!!..
కవితల అల్లిక!!..
మిత్రమా!!....
సామాజిక దృశ్యాన్ని
ఓ అద్భుత దృశ్యంగా
నిలుపుదాం!!..
భవితవ్యానికి...
బాటలు వేద్దాం!!...
మిత్రమా!!
మనది ఆత్మీయ చరిత్ర!!..
ఎప్పటికీ మరణించొద్దు!!
ఆత్మీయతకు మరణంలేదు!!..
మనమే...ఓ నిశ్శబ్ద పుస్తకాలం!!
పిలిస్తే..పలుకరిస్తే శబ్దమై లేస్తాం!!..
ఇదే మిత్రమా!!..ఆత్మీయతంటే!!...
- అంబటి నారాయణ