Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆయన ఓ చేయి తిరిగిన పాత్రికేయుడు, బహుభాషా కోవిదుడు.జ్ఞానపీట్ అవార్డు పొందిన సాహితీ సృజన కారుడు. రాజకీయ దురశీదురుడు, అచ్చ తెనుగు తనానికి మారు పేరు. పదవులకే వన్నె తెచ్చిన రాజకీయ కోవిదుడు. ఆయనే మన జాతిరత్నం పి .వి.నరసింహారావు. ఈ జాతిరత్నం 1921 జూన్, 28న వరశీగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామశీలో సీతారామారావు, రుక్మాబాయి దంపతుల ఇంట వరాల పుత్రునిగ జన్మించారు. పి. వి. చిన్నతనం నుంచి కూడ అపారమైన తెలివితేటలతో ఉండి అన్ని విషయాలలో కూడ ఎంతో చురుగ్గా వుండేవారు. అందుకే బహుముఖ ప్రజ్ఞ అన్న పదానికి అసలు సిసలైన అర్థం చెప్పిన మేధావి. కరీంనగర్ జిల్లా వంగర వాసులు పాములపర్తి రంగారావు, రుక్మిణమ్మ దంపతులకు దత్తత వెళ్లడం వల్ల పాములపర్తి వెంకట నరసింహారావుగా పేరు మారింది. ఉస్మానియా యూనివర్సిటీ నుండి డిగ్రీ, నాగపూర్ యూనివర్సిటీ నుండి లా డిగ్రీ పూర్తి చేశారు.
పి. వి. ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్న పుడే స్వతంత్ర ఉద్యమాల్లో బాగా పాల్గొనేవారు. ఆ విధంగా ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైంది. 1951లో ఎ. ఐ. సి.సి. మెంబరు అయ్యారు. ఆ తర్వాత మశీధని ఏం.ఎల్.ఎ. గా నాలుగు సార్లు ఎన్నికయ్యారు. తెలంగాణా ఉద్యమం తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. కొందరు మంత్రులు రాజీనామా చెయ్యడంతో 1973లో అసెంబ్లీని రద్దుచేసి రాష్ట్రపతి పాలన విధిశీచారు. అదే సంవత్సరం ఇందిరాగాంధీ పి. వి. ని ఎ.ఐ.సి.సి. ప్రధాన కార్యదర్శిగా నియమించారు. 1977లో వరంగల్ జిల్లా హనుమకొండ, 1984లో మహారాష్ట్రలోని రామ్‌టెక్ నుంచి ఎశీ.పి. గా గెలిచి కేంద్ర మంత్రి పదవులు విజయవంతంగా నిర్వహించారు.
అలాగే అంతర్జాతీయ సమాజంపై ఆయనకున్న అవగాహన, 18 భాషలపై ఆయనకున్న పట్టు పి.వి. కి విదేశాశీగ మంత్రిపదవి వరిశీ చింది. విదేశీయులు సైతం అబ్బురపడే విధంగా ఆ పదవికె వన్నె తెచ్చారు. ఆ తర్వాత రాజీవగాంధీ మరణంతో ప్రధాని పదవి చేపట్టారు. దేశ ప్రధాని అయిన తొలి తెలుగు తేజం పి.వి. నరసింహారావు గారు. అప్పట్లో మైనార్టీ ప్రభుత్వాన్ని సమర్థవంతశీగా నడిపించడంలో కీలక పాత్ర పోషించారు. ప్రధానిగా ఆయన చేపట్టిన సంస్కరణలు దేశ భవిష్యత్తుని మార్చి రాజనీతికి, చాణక్యానికి నిదర్శనంగా నిలిచి అపర మేధావిగా కీర్తిశీపబడ్డారు. ఇంకా ఆయన ఆర్థిక సంస్కరణల పితామహుడిగా కూడా వినుతికెక్కారు.
ప్రధాని పదవికె వన్నె తెచ్చిన ఈ తెలుగు జాతిరత్నం సాహితీ పూతోటలో కూడ తన రచనల్ని ఎంతో గొప్పగా వీరబూయిచారు. మహా గ్రంధాల అనువాదం, సొంత రచనలు, కవిత్వం ఇలా తనదైన శైలిలో ఆణిముత్యాల్లాశీటి రచనలు చేశారు. అలాగే విశ్వనాధ సత్యనారాయణ 'వేయి పడగలు' నవలను 'సహస్రఫన్' గా హిందీలోకి అనువదించారు. దీనికి గాను 'కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని' కూడ అందుకున్నారు. 'ఇన్సైడర్' పేరుతో అయన రాసిన ఆత్మకథ మంచి ఖ్యాతిని తెచ్చి పెట్టింది. ఇంకా 'కాకతీయ' అనే పత్రికను ప్రారంభించి అందులో 'జయ' అనే పేరుతొ అద్భుతమైన వ్యాసాలు రాసారు. ఓ గొప్ప రచయితగా, ఇంకా స్వతంత్ర భారత రాజకీయాలలో తన ప్రత్యేకతను చాటిన మహానేత, బహుముఖ ప్రజ్ఞాశాలి పాములపర్తి వెంకట నరసింహారావు గారు 2004 డిసెంబర్, 23న పరమపదిశీ చారు.
పింగళి. భాగ్యలక్ష్మి,
గుంటూరు, 9704725609