Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్నిగ్థ మనోహర
చిత్ర కళా శైలికి
కుంచె కదలికతో
జీవం పోసిన అజరామరుడు..
హరివిల్లులో కానరాని రంగుల్ని
తన కుంచెతో అద్భుతంగా
కళ్ళముందుంచిన
'వర్ణ' కారుడు..
రామాయణ, మహాభారత, భాగవత, భావుకత, రసరమ్య రమణీయ దృశ్యాలు..
కళ్ళకు కట్టినట్టుగా..
పత్రికల ముఖచిత్ర కేన్వాసుపై వర్ణ ధారగ వర్షింపజేసిన రంగుల ప్రేమికుడు..
మనసుకు రసార్థక రంగులద్ది
అంతరంగపు బీడుకు అపారమైన భావార్థక పోహళింపుతో సొబగులదిమిన కవి, రచయిత, మితభాషి, సాహిత్య సవ్యసాచి..
భారతీయ గొప్ప చిత్రకళా పోషకుడు..వర్ణ విన్యాస కుంచెకు మారు పేరు
వడ్డాది పాపయ్యగారు..!
-సుజాత.పి.వి.ఎల్,
సైనిక్ పురి, సికిందరాబాద్.