Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏదో బతకలేక...
బతుకుచున్నాం??...
మృత్యుతో నిత్యం
పోరాడుతూ!!....
ఎందరినో పోగొట్టుకున్నాం
అందరూ..ఆత్మీయులనే!!...
ఇరవైయవ వత్సరం అందరికీ
మరణ శాసనం రాసిపోతోంది!!..
వింత జడిభూతాన్ని అంటగట్టి
కరోనా రూపంగా!!...
ఎన్నెన్నో వికృత కృత్యాలతో
అందరినీ బలికొంది!!...
ఎందరివో భావి బతుకులు బలైపోయాయి!!...
పుడమి పొత్తిళ్ళను చీల్చి...
భూ భ్రమణం సృష్టించి..
ఎందరినో మింగేసింది!!...
తుఫానులా సునామీ పుట్టించి
పునాదుల్లోనే పాతిపెట్టింది!!..
లెక్కలేనన్ని జనాలను
తనడొక్కలో వేసుకొంది!!...
ఒక వ్యూహాత్మక ధోరణితో
విశ్వమంతా విరుచుకుపడింది!!...
ఏదో కొత్త సంత్సరం వస్తుందంటే...
కొత్తపోకడలను కొంగ్రొత్త సంతోషాలను
నింపుతుంది అనుకుంటాం!!...
ఏ రూపంగా అడుగేస్తోందో...
పిడుగులా ఎలా పడేస్తోందో..
తెలియని సందిగ్ధం!!??....
కేకులు కట్ చేయడం...
హ్యాపీ న్యూఇయర్
చెప్పుకోవడం...
అందరితో ఆనందాన్ని
పంచుకోవడం...
సంతోషాలను నింపుకోవడం!!...
కానీ చివరికి ఓ సంచలనం సృష్టించి
అందరినీ సందిగ్ధంలో పడేస్తుంది...
ముందు ముందు మురుస్తూ
చివరికి అందరం కూడా
గోతిలో పడిపోతాం!!...
శరీరానందంలోపడి
మానసిక ఆనందాన్ని
మరిచిపోతాం!!....
న్యూఇయర్ వస్తుందంటే
అందరూ కేరింతలు
కొడతారు..
మత్తులోఊగి తేలుతారు...
ఇదే మహా గమ్మత్తు
అనుకుంటారు...
ఎప్పుడు బంధాల్ని తెంపేస్తుందో!!??
ఎప్పుడు ఆత్మీయతను తుంచేస్తుందో!!??
ఎప్పుడు ఏ గుండెల్ని చిదిమేస్తోందో!!??
ఎవరికీ అర్థంకాని కొత్తవత్సరం!!...
న్యూ ఇయర్ వస్తోంది...
జర జాగ్రత్త...జాగ్రత్తగా ఉండండి!!...
ఇప్పుడు కొత్త సంత్సరం
వస్తుందంటే వెన్నులో
వణుకు పుడుతోంది!!....
ఎన్నిచిత్రాల్లో..ఎన్ని విచిత్రాల్లో!!??...
అప్పడికప్పుడే మార్పు!!...
అప్పడికప్పుడే ఓ ప్రమాదం!!...
నమ్ముకున్న రైతులమీదనో...
సామాన్య జనాలమీదనో...
కక్ష తీర్చుకుంటుంది!!...
ఏదో రూపంగా దాడిచేస్తుంది!!...
అందరినీ బలికొంటుంది!!.. బజారున పడేస్తుంది!!...