Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మానవాళికి మరోసంవత్సరం
నూతన ఆశల సూర్యోదయానికి స్వాగతం
ప్రతి మనిషికో సంతోషం
ఈరోజు నేనున్నానంటూ
కాలమెంత విషం చిమ్మినా
అకాల వర్షాలతో అతలాకుతలమైన
అంతుచిక్కని వ్యాదులు
ప్రాణాలు తోడేస్తూ
ఆప్తులను అందనంతదూరం
తీసికెళ్ళినా
వలస మనుషులంతా
ఎర్రటెండలో
ఆలుపిల్లలతో అలసిసొలసి
పాదాలెంత బొబ్బలిచ్చినా
పొలిమేరకు చేరేక్రమంలో
కొన్ని నడకలు
మార్గమధ్యంలో ఆగినవి
మిడతలదండు పంటలపై దాడిచేసి లోకానికి హెచ్చరించాయి
విశ్వమంతా విలవిలాడింది
ఎటుతోచని స్థితిలో
ప్రళయం తాండనవమాడుతోంది
పైకెంత గాంభీర్యం ప్రదర్శించిన
లోలోపలంతా శూన్యం నిండింది
హృదయాలు వేధనతో విలపిస్తున్నాయి
గత సంవత్సరం
అడుగడుగునా ఆందోళన
హఠాత్తుగా సంభవించిన
విపత్తు
మానవత్వం పరమళింపజేసింది
నడిచివచ్చిన దారుల
పాదముద్రల్లో ఎన్ని భయాలుదాగున్నాయో
ఎప్పుడుచూడని కాలం
కొత్త అడుగుల దారుల్లో
భయం తోడుగానేఉంది
మిడతదండు శబ్దం, దృశ్యం
కళ్ళముందు కదులుతుంది
మనిషికి మనిషికి మద్యకి
చీల్చివేస్తూ ఎంత దూరం తరుముతుందో?
అంధకారం చీల్చే
కొత్త కాంతులు రావాలని
కరోనా కాలసర్పం కోరలుపీకే
వ్యాక్సినొకటొచ్చి
మానవాళికి కొత్త ఆశ చిగురింపచేయాలని
కోటి ఆశలతో కొత్త సంవత్సరంలోకి అడుగెడదాం
- సి. శేఖర్(సియస్సార్),
9010480557.