Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సమాజ విప్లవ చైతన్యశీలి..
దీన జనోద్థరణకు
అహర్నిశం శ్రమించిన త్యాగమయి..
కులమతాలకు అతీతంగా
అనాధలకు అభయమిచ్చి ఆదరించిన ప్రేమమయి..
స్త్రీ కి విద్య ఆవశ్యకమని
బాలికా పాఠశాలను స్థాపించిన
భారత దేశ తొలి మహిళా ఉపాధ్యాయిని
సావిత్రీబాయి పూలే..
అస్పృశ్యతా నివారణకు
అనుక్షణం పరితపించి..
తన వ్యక్తిగత జీవితాన్ని ధారపోసిన ఆదర్శ వనిత..
అంటరాని తనం, బాల్య వివాహాలు, మూర్ఖ సంప్రదాయాలను రూపుమాపి,
స్త్రీ స్వేచ్ఛ సమానత్వం కోసం చేసే ఉద్యమంలో..
తన భర్త జ్యోతిరావుతో కలిసి నడిచిన సహధర్మచారిణి..
ప్లేగు వ్యాధిగ్రస్థులకు సేవలందిస్తూ..ప్రాణాలర్పించిన సేవా తత్పరణి..!
సుజాత.పి.వి.ఎల్, సైనిక్ పురి, సికిందరాబాద్.