Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నేలమ్మా!!...
నీ ఆధారం లేకపోతే..
మానవులకు..
వీలునామాతోనే పనిలేదు!!..
అసలు..సమస్త ప్రాణకోటి
లేనే లేదు!!...
పుడమి లేకపోతే ఇక
పుట్టుకెక్కడ వుంటుంది!!??...
నీరులేదు.. నింగిలేదు!!..
గాలిలేదు.. ధూళి లేదు!!..
కొండలులేవు.. బండలులేవు!!..
చెట్టులేదు.. చేమలేదు!!..
వాగులేదు.. వంపులేదు!!..
కడలిలేదు.. కెరటం లేదు!!..
తావులేదు.. తోవలేదు!!..
నిజం లేదు.. నిప్పులేదు!!..
ఆకలిలేదు.. అలసటలేదు!!..
జగములేదు.. జీవములేదు!!..
వెలుగులేదు.. చీకటిలేదు!!..
వర్ణాలులేవు..వర్ణచిత్రాలులేవు!!..
ఋతువులులేవు..
వసంతాలులేవు!!...
ఇల్లు లేదు ఇడుపు లేదు..
కాలుష్యమూ లేదు!!..
పుడమి లేకపోతే అసలు మనిషేలేడు!!..
ఆకాశపు అంచులులేవు!!..
అగాధపు లోతులులేవు!!...
అవని లేకపోతే..ఆమని ఎక్కడ!!??...
రేపులేదు..మాపులేదు!!..
నిన్నలేదు..మొన్నలేదు!!..
నేడులేదు..నాడులేదు!!..
పుడమే లేకపోతే..
పుట్టుట..గిట్టుట ఎక్కడ!!??...
ముప్పులేదు..తప్పులేదు!!..
కాళ్ళ కింద.. భూమిలేక పోతే
ఊహకందని.. ఊపిరి
ఊగిసలాడుతుంది..!!
అందనిది..అందుకోలేనిది
అంతా.. శూన్యం!!..
ప్రసవించే.. భూమిలేదు!!...
ప్రసరించే.. చూపులేదు!!...
సృష్టిలేదు.. దృష్టిలేదు!!...
ఎవరికీ కనిపించని...
అంతా నిర్వీకారం!!...
ప్రకృతి..వికృతి లేదు!!..
అనుకూల.. ప్రతికూలశక్తులులేవు!!..
పల్లె లేదు.. పట్నంలేదు!!..
కరువులేదు కాటకంలేదు!!...
ప్రాణమే లేనప్పుడు
ప్రమాదం ఎక్కడుంటుంది..!!??...
నిలబడే తావులేదు..
ఇక నీడ ఎక్కడుంటోంది..!!??...
తనువులేదు.. అణువులేదు!!..
తలుచుకొనే.. వారే లేరు!!...
భూమి లేదు.. భుక్తిలేదు!!..
- అంబటి నారాయణ
9849326801