Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అదిగో!!...చూపుల తీరాలలో
ఉదయించే ఉషస్సు!!...
ఆ తేజస్సు!!... కార్యార్థియై
వచ్చిన కారణజన్ముడు!!...
అతని రూపం గంభీరం!!...
చూస్తేచాలు
దైర్యంవస్తోంది!!...
అతని కలం...ఓ చైతన్య శస్త్రం!!..
అతని గళం..దారుణాలపై
శంఖారావం!!...
సమస్త దళితుల కంఠనాదం!!...
అతని వాక్కు...ఓ ప్రభోదగేయం!!...
అతని హావభావాలు
ఓ అమృత భాండం!!...
అతని నడక..
ప్రపంచ విజేత!!...
చూపు సమస్తాన్ని
చుట్టేస్తోంది!!...
ప్రపంచ మేధావి..
పరుగులు పెట్టించే సమతావాది!!..
అతని ధిక్కార స్వరానికి..
ప్రపంచమంతా పరుగులే!!...
తనజాతి యావత్తూ...
స్వేఛ్చావిహంగంలో
ఎగురుతుంది!!...
దళితుల అణిచివేతపై..
కదంతొక్కిన కాలయముడు!!...
అసమానతల అడ్డుగోడలను..
కూల్చిన ప్రచండ యోధుడు!!...
మానవీయ విలువలను నింపిన
మహా నీయుడు!!...
గంభీర శబ్దానికి
నరాలన్నీ ఒక్కటిగా...
ఉక్కుతీగలై...
నిశ్శబ్దన్ని చీల్చుతోంది!!...
అతనికి అతడే సాక్షి!!...
లోకానికి అతడే వెలుగు!!...
ప్రపంచ దేశాలకు మార్గదర్శి!!...
అతని పేరులో ఓ అద్భుత
శంఖారావం దాగివుంది!!..
పేరు తలుచుకొని కొలుచుకొంటే
రాజ్యాంగంలోని
రాతలు గుర్తుకొస్తాయి!!...
రాజకీయానికి కావలసిన
ఆయుధాలన్నీ
సానబెట్టి ఉంచాడు!!...
అతనిలోని అక్షర
శబ్దాలే ఆయుధాలు!!...
అందుకే...అతడొక శబ్దభేరి!!...
ఏ రణరంగంలోనైనా
నిలబడగలడు!!....
ఏ సభలో అడుగు పెట్టినా
అందరికి గుండెళ్ళో
దడపుట్టించగలడు!!...
మరికొందరికి చమట తడి
తెప్పించగలడు!!...
అతడు ఓ ప్రచండ హోరు!!...
మానవీయ విలువలు నిండిన తీరు!!..
విద్యావేత్త..దేశాధినేత...
రాజ్యంగా నిర్మాత...
లోకానికి సూర్యుడు సాక్షి!!...
సమస్త దళితులకు
అంబేద్కర్ సాక్షి!!...
అంబటి నారాయణ
నిర్మల్
9849326801