Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భావానికి శబ్ధం కలిపి..
కవిత్వానికి కొత్త అర్థం చెప్పిన అనుసృజన అధివాస్తవిక కవి..
ప్రేమ, సౌందర్యం,
సత్యం, త్యాగం,
సహాయం, సానుభూతి,
సాంఘిక చైతన్య స్ఫూర్తి కేవలం కవిత్వంతో సాధ్యమని..
కళాకారులంతా అమరులేనని చాటి చెప్పిన అసాధారణ కవి శ్రీ వేగుంట మోహన్ ప్రసాద్..!
తెలుగు కవుల్లో ప్రత్యేక ఉనికి సొంతం చేసుకుని..
'మో' కలం పేరుతో..
ఆత్మశ్రీయ ధోరణితో
'హిమనీ హృది' తొలి రచనకి పెద్దపీట వేసి..తెలుగు కవిత్వాన్ని ఆంగ్ల పాఠకులకు అందించిన అనువాద శాఖాధిపతి..
ఏది అశాశ్వతమో..అదే సత్యమని..'రహస్తంత్రిని' మీటిన కవితా మాంత్రికుడు,
నాస్తిత్వస్తిత్వ వాదాలకు,
ఉద్వేగ సంభరిత హృదయానికి సాక్షీభూతుడు..
హరివిల్లు వర్ణాలుగా తన కలం నుండి జాలువారిన ఏడు కవితా సంపుటాద్భుతాలను మనకి అందించింది అందుకేనే'మో'!..
- సుజాత.పి.వి.ఎల్.,సైనిక్ పురి, సికిందరాబాద్.