Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డా|| కందేపి రాణీప్రసాద్
9866160378
భర్త ఆఫీసుకు వెళ్లిపోయాడు తలుపులు వేసి లోపలికి వచ్చింది విజయ. మంచం మీద చిరునవ్వులు చిందిస్తూన బాబు. బాబుకు అప్పుడే ఏడునెలలు వచ్చేశాయి. నిన్ననే అమ్మ వాళ్ళింటి నుంచి వచ్చింది ‘నేను రవాలా’ అని రాత్రే అత్తగారు ఫోన్ చేసి అడిగింది. ఆమె వస్తే తనకు అడ్డు అనుకున్న విజయ “పర్లేదు అత్తయ్య తోడేమీ అవసరం లేదులే. బాబు ఇప్పుడు కూర్చుంటున్నాడు. స్నానం చేయించేస్తాను” అంటూ ఎక్కడ వస్తుందో అని జాగ్రత్తగా చెప్పింది.
ఫోన్ పెట్టేసి బాబు దగ్గరకు వచ్చింది. వీడి స్నానమొక్కటి అయిపోతే పనంత అయినట్లే అనుకుంది విజయ. స్టవ్ మీద మరగబెట్టిన నీళ్ళు తెచ్చి పెరట్లో పెట్టింది. సబ్బు, షాంపూ, ఆయిల్, తువ్వల అన్నీ సిద్దం చేసింది. బాబును తీసుకెళ్లి పీట వేసుకొని కూర్చున్నాక చనీళ్ళ బకెట్ పెట్టుకోలేదని గమనించింది సరే బాబునక్కడ కూర్చోబెట్టి బాత్ రూం లో కేళ్ళింది. నీళ్ళ బకెట్ తీసుకొని నాలుగడుగు వేసేలోగా ఇళ్లదిరి పోయేలా బాబు పెట్టిన కేకలు వినిపించాయి. ఒక్క ఉడుటున బకెట్ పడేసి బాబు దగ్గరకు వెళ్లింది. వేడి నీళ్ళలో పది బాబు గిలగిల కొట్టుకుంటున్నాడు. గిన్నె దొర్లిపోయి ఉన్నది. బాబు గిన్నెను తోసి ఉంటాడు నీళ్ళు కిందపడి పోయాయి ఆ వేడీకి బాబు ఒల్లంత కాలిపోయింది.
బాబును ఎప్పుడు ఆసుపత్రికి తీసుకు వెళ్ళరో, భర్త ఎప్పుడు వచ్చాదో ఏమి గుర్తు లేదు విజయకు చర్మం కాలిపోయి హృదయవిదారంగా ఏడుస్తున్న బాబు మాత్రమే కనిపిస్తున్నాడు. పిల్లాడి ఏడుపులకు ఆసుపత్రి అంతా దద్దరిల్లి పోతుంది. డాక్టరు పరీక్ష చేస్తూనే నర్సులకు పనులు పురమాయిస్తున్నాడు. నర్సు ఒల్లంత బర్నల్ రాశి ఇంజక్షన్ వేస్తున్నది. అన్నీ పరీక్షలు పూర్తి చేసుకొని నర్సుకు ఏమేం చేయాలో సూచనలు చెప్పి డాక్టరు ఇవతలకు వచ్చాడు.
డాక్టరు కుర్చీలో కూర్చుంటూ “ఎమ్మా ఇదెలా జరిగింది వేడి నీళ్ళ దగ్గర బాబును వదిలి చన్నీళ్ళ కోసం లోపలికి వెల్లవుకాదూ” అడిగాడు. విజయ ఆశ్చర్యంతో నోరు తెరిచింది. ఏమిటి ఇంటికొచ్చి చూసినట్లుగా మాట్లాడుతున్నాడు’ అనుకుంది విజయ మనసులో. ఏంటి! డాక్టరు మీకేల తెలుసు అనుకుంటున్నారు కదూ! చాలా మంది చేసే తప్పేనమ్మా ఇది. అందుకే అడుగుతున్నాను పిల్లవాడు నీళ్ళేందుకు పట్టుకుంటాడు అనుకోవటమో, నేను ఎంత సేపట్లో తెస్తాను అనుకోవటమో జరుగుతుంది. కానీ ప్రమాదం జరుగుతుందని అసలు ఊహించారు” అన్నాడు డాక్టరు తన రూము లోకి దారి తీస్తూ.
విజయనూ, ఆమె భర్త మహేష్ నూ డాక్టరు తన రూము లోకి పిలిచి కూర్చోబెట్టాడు. ‘మీకు ఈ బాబు మొదటి సంతానం కదూ’ అన్నాడు డాక్టరు. ‘అవును డాక్టరు గారు’ అంటూ విజయ మ్మనసులో “ఈయనకేదన్నా దివ్యదృష్టి ఉన్నదా’ అన్నీ ముందుగానే తెలిసి పోతున్నాయి’ అనుకున్నది. చూడమ్మా! మొదటిసారిగా బిడ్డను కానీ పెంచేవాళ్లు చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. రెండో బిడ్డ పుట్టేటప్పటికి మీకే కొద్దిగా అవగాహన వస్తుంది. తొలిసారిగా బిడ్డను పెంచేటప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే మంచింది. కానీ ఇప్పటి తరం పెద్దవాళ్ళు ఉండటాన్ని ఇష్ట పడటం లేదు. ఏడాదిలోపు పిల్లలతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ప్రతి సమస్యకు డాక్టరు వద్దకు వెళ్ళి పరిష్కారం తెలుసుకోలేరు. ఇలా జరగవచ్చన్న ఊహ మీ పెద్దవాల్ల అనుభవంలో తెలుస్తుంది. పెద్దవారిని ఆనవసర లాగేజీ అని భావించకండి ప్రమాదాలు కొని తెచ్చుకోకండి” అని హితవు పలికాడు డాక్టరు. బయటకు వచ్చాక విజయ భర్తతో చెప్పింది “వెంటనే అత్తమ్మకు రమ్మని ఫోన్ చేయండి”. మహేష్ జేబులో సెల్ తీసి అమ్మకు విషయం చెప్పాడు.