Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాహిత్యమే సమస్తమని
సాగిపోతున్నా!!...
కవిత్వపు పరిమళం
పొగమంచులా కమ్మేస్తోంటే...
కరిగిపోయిన కాలములో
ఎన్నోజ్ఞాపకాలను
ఒలుచుకున్నా!!...
ఎన్నో అనుభూతులను
గుండె నిండా నింపుకున్నా!!...
అప్పుడే కొత్తగా ఉదయించాను!!..
వెఛ్చని కిరణాలతో...
పచ్చని ప్రకృతి వాకిళ్ళుతెరిచాను!!..
నాచూపుల స్పర్శ చుట్టేసింది...
ఎన్నెన్నో ఎందరెందరివో
ఆలోచనలను
ప్రోగుచేసుకొన్నా!!...
ఎన్నెన్నో సరిహద్దులను దాటి
కన్నీటి కథలను
కవిత్వంలో నిలుపుకొన్నా!!...
అద్భుత క్షణాలు
గుర్తు వచ్చినప్పుడల్లా...
నా హితులు..స్నేహితులు
జ్ఞాపకంచేసినప్పుడల్లా...
కఠినకాలంలోంచి...
సామాజిక సంతలోంచి
సమాజంలోని వింతలను
రాస్తుంటా!!...
ఆశలవలయం నాచుట్టే!!..
ప్రేమనిలయం నాఇల్లే!!...
మోడైన బతుకు మొదళ్లో
కవిత్వపు నీళ్లుపోసి...
కొంతగా చిగురింప చేస్తున్నా!!...
రాస్తోంటే కొన్ని పాత్రలు
దాడులుజరుపుతాయి!!...
దౌర్జన్యం చేస్తాయి!!...
కత్తులు ఝళిపిస్తాయి!!..
కల్లోలం సృష్టిస్తాయి!!...
అన్నిటిని నెట్టేసుకొంటూ...
వచ్చిన నిందలను
తుడిచేసుకొంటూ...
నాటివి నేటివి
నెమరేసుకొంటూ...
కనబడే అసత్యాలను
దిగబడిన సత్యాలను
తట్టి లేపుతుంటా!!...
కొందరి జాతక చిట్టాలను విప్పి..
మరికొందరి నిశ్శబ్ద గుండె
కవాటాలను తెరిచి...
నిజం గుట్టు బయటపెట్టిస్తా!!...
కొందరు అంతర్ముఖంగా వుంటూ
అంతులేని
అగాధాన్ని సృష్టిస్తారు!!...
అందరూ గొప్పవారే!!...
వారిలోని తప్పుదార్లను చూస్తా!!..
మూసుకున్న కళ్లను తెరిపిస్తా!!...
ఓ ప్రభంజనంలా వెల్లువెత్తుతా!!...
కొందరి బద్దకాలను బద్ధలుకొట్టాలి!!..
సుతిమెత్తగా సమస్తాన్ని
నా హృదయంలోకి రప్పిస్తా!!...
నిత్యం కవిత్వమై తట్టుతోంది!!....
అంబటి నారాయణ
నిర్మల్
9849326801