Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అతడో తాత్విక గని!!...
అతడొక నిశ్శబ్ద
ప్రేమ ముని!!...
అంతర్ముఖుడై
మనస్సుతో మాట్లాడుతాడు!!...
అతడొక రుద్రవిపంచి!!..
కళ్ళుతెరిస్తే
జాలువారుతుంది కవిత్వం!!...
మౌనంతోటే...
ఎదుట ఉన్న వ్యక్తి
మనసు తెలుసుకోగలడు!!...
నడకలో ప్రభంజనం!!...
నడతలో ప్రావీణ్యం!!....
ఆకాశమంత అనురాగం...
భూదేవంత ఓర్పు...
గుండెల్లో నిక్షిప్తమైఉంది!!...
రేపటికొరకు నేడే బాటలు...
కాలం ఎప్పుడు పాతదే!!....
కొత్తకొత్త మార్పులకు...
అతనెల్లప్పుడూ నవతాసారథి!!...
ఇతడొక అజాతశత్రువు!!...
అతనిమాటలు
సంధించిన బాణాలు!!...
మాటలతో సమస్యల
పద్మవ్యూహాలను ఛేదించగలడు!!...
తరతరాల తెలంగాణ
అంతరాల మాటల దొంతరలను
తనకుతానే చెక్కుకొన్న శిల్పి!!...
సహజసిద్ద జీవనంతో...
అడ్డంకుల్ని అధికమించే నేర్పరి!!...
నిన్నటి రోజుని తలచుకొని..
రేపటిని జాగ్రత్తగా మలుచుకొని...
నేడు లో కొత్తగా జనించి...
రేపటికొరకు కొత్తగా...
ప్రతిఫలించే వాస్తవుడు!!....
ఆస్తిలో ఆకాశం అంచులోఉన్నా...
అఖాతపు జీవనలోతుల్లో ఉన్న
వారందరికీ చేయూతయై చేరదీస్తాడు!!..
చరిత్రకే ఓ చరిత్ర కారుడు!!...
అతడో తాత్విక గని!!...
అందుకే అతని అడుగుజాడల్లో
నడుస్తున్నాం!!...
అతడు సాదాసీదాగా ఉంటాడు!!..
తట్టితే ఒక సైన్యమై లేస్తాడు!!...
అతనిది అభయహస్తం!!...
అదే చేతిలోని ఆయుధం!!...
అందరి చేతి రాతలు
మార్చే గీత కర్త చేతి చక్రం!!..
అన్ని చింతలను తొలిగించేవాడు..
మాకెంతో ప్రశాంతను కలిగించేవాడు..
మా అందరికీ కావలసిన...
నిర్మలమైన హృదయుడు...
అంబటి నారాయణ
నిర్మల్
9849326801