Authorization
Mon Jan 19, 2015 06:51 pm
1.పుట్టిన వాడు గిట్టక తప్పదు అని తెలిసినా
తప్పటడుగులు వేసి
పబ్బగడపుకోవడమే నేటి
కలికాలపు లక్షణం అయిపోయింది
2.సినిమాలో చేస్తే వ్యాంపు
జీవితం లో చేస్తే కంపు
జానెడు పొట్టకోసం
బలవంతపు మానాన్ని ఖరీదు కు పెడితే వ్యభిచారి
ఆడది ఆడే అటలో నా
ఖరీదు కట్టే తిరులోనా
ఏమిటి ఈ విధి వైచిత్రం
3.ప్రశ్నించే గొంతు బానిస
ఛాయాలను సహించదు
అణిచివేత ఉన్నచోటే విప్లవం జనిస్తుంది
దక్షిణాఫ్రికా నెల్సన్ ఇండియా లో భగత్ సింగ్
అల్లూరి అయిన ఆజాద్ అయిన అడుగులకు మడుగులు ఒత్తలే
హక్కును ఆవేశంగా ప్రశ్నించారు జగతిని గెలిచారు
4. అగ్గి పుల్ల కల్చగాలదు.. గుడిసెను దహించా గలదు
కత్తి కూరగాయలు తరుగవచ్చు...తలనరుకాగలదు
వాడే వాడీ వ్యక్తిత్వాన్ని తెలుపు
5. సముద్రానికి అటుపోటులు
జీవితమన్నాక ఎత్తుపల్లలు సహజం
ఓటమిలో కుంగిపోకు
విజయంతో విర్రవీగాకు
నిన్ను నివ్వు నమ్ముకో
పారన్న జీవనం వెన్నుముక లేని శరీరం
సాగు లక్ష్యం పెద్దది అయినప్పుడు
అడుగులు కూడా ఆత్మవిశ్వాసం తో వెయ్యు
చికెట్లోనే వెలుతురు విలువ
కష్టించి పనిచేసినప్పుడే
శ్రమ విలువ
తెలుస్తుంది
- ఉమశేషారావు వైద్య
`లెక్చరర్ ఇన్ సివిక్స్