Authorization
Sun March 02, 2025 07:54:38 am
ఓ వ్యవస్థా!!...
ఏంటి మాకీ అవస్థ!!??...
ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు!!...
ఎక్కడెక్కడేమేమి
జరుగుతోందో!!??...
ఎవరి దారి ఎటుపోతోందో!!??...
ఏ దారిలోఎవరు నడుస్తున్నారో!!??...
ఎవరు ఎవరితో
మోసపోతున్నారో!!??...
అక్రమాల అడ్డుదారిలో
నడిచే వారెందరో!!??....
దొడ్డిదారిలో
దోబూచులాడే వారెందరో!!??...
నిజాన్ని మింగేసి...
అబద్దాలతో
ఆడించేవారెందరో!!??...
అవస్థలను సృష్టించి...
అమాయకులను
నమిలేస్తోన్న వారెందరో!!??...
ఎన్ని కన్నీటి కథలు
కనబడుతాయో!!??...
బుక్కెడు బువ్వకు
బతుకంతా కన్నీరే!!...
కొందరి కలలను
కాళ్ళ రాస్తున్నారు...
తరాల దుఃఖాన్ని
మోస్తున్నారు మరికొందరు!!...
కొందరివి
వెలుగుచూడని జీవితాలు!!...
కొందరి అక్రమాల దోపిడీలను
ఎదిరించలేక...
బతుకు మీద భరోసా లేక...
జీవితములో గెలువలేక...
తలెత్తుకు తిరగలేక...
ఎందరెందరో
బలవుతున్నారు!!...
ఎందరో జీవితాలకు శాపమై...
గుండెళ్ళో ఆరిపోని తాపమై...
ఆవహించి హరిస్తున్నారు!!...
వారి ఆగడాలకు అడ్డే లేదు!!...
అందుకే...ఓ వ్యవస్థా!!...
నీ డొక్కలను పొడిచేవారెందరో!!??...
నీ దిక్కులను చీల్చే వారెందరో!!??...
దొరకబట్టి చూడు...
జరుగుతున్న నిత్యనూతనం!!...
కళ్ళు తెరువు!!....
నిజమైన వారి
కుళ్లు కనబడుతుంది!!...
ఒళ్ళు విరుచుకులేస్తున్న...
అన్యాయాలు కనబడతాయి!!...
నిషాలో వుంటూ
విషాన్ని కక్కేవారెందరో!!??...
మనుషుల్లో దాగివున్న
నిజమైన పైత్యం కనబడుతోంది!!...
కొందరి కుత్సిత కుతంత్రాల
దారులు అగుపిస్తాయి!!...
కొందరివి భూఅక్రమాల కలవరింతలు!!..
కొందరివి పచ్చనినోట్ల
పలవరింతలు!!...
తూర్పున ఉదయించేది
సూర్యుడు కాడు!!...
మనుషుల ఆశల ఆలోచనలు!!...
ఎందరో అమాయకులు
నిరాశా నిస్పృహల ఊబిలో
కొట్టుమిట్టాడుతున్నారు!!...
అంబటి నారాయణ
నిర్మల్
9849326801