Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉమశేషారావు,
వైద్య కామారెడ్డి జిల్లా
ప్రకృతి మమైకం అయ్యి
వైజ్ఞానికంగా విలీనము అయ్యి
సంస్కృతితో సౌరభాలు వేదజేల్లే పండుగ
మన సంక్రాంతి
ఆకాశం లో పిల్లల ఎగరవేసే పాతంగులు
భూమి పై అతివలు వేసే ముగ్గులు
పౌషకలు మెండుగా నిండిన పిండివంటలు
గంగిరెద్దుల విన్యాసాలు
హరికథ కుల జీవమర్మం
ధర్మరాజు జూదాన్ని గుర్తు చేసే పండుగలు
బొబ్బెమ్మలు..ఎద్దులాటలు
తెలుగు తనం ఉట్టిపడే వస్త్రధారణ..
పాపాలను దాహించి వేసే బోగిమంటలు..
రైతుల ఇంట ధాన్యాసిరులు
సంఘజీవన సౌరభాలు ఇంటి ఇంటి ఆనంద డోలికలు
మంచిని పెంచి అనుబంధాలు విలువలు పెంచి
కరోనా నుండి కాపాడిన మన సంస్కృతి కొనసాగిద్దాం
ఉత్తరాయణ పుణ్యకాలంలో మానవత్వం పరిమలించి
కరోనా ఖతం అయ్యి బంగారు కాంతి కావాలి మన సంక్రాంతి
ఇది పూర్తిగా నా స్వీయారచన అని హామీ ఇస్తున్నాను