Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డా. కె. దివాకరా చారి, 9391018972
ఎప్పుడైనా...
నేను చదివిన అప్పటి
సర్కారీ బడి ముందు నుంచి
వెళ్తున్నప్పుడు దాని జీర్ణావస్థ
చూసి కంట తడిపెట్టిస్తూ
'నన్ను నిలబెట్టి
అది పడిపోయింది'
అనే భావన కలుగుతుంది !
నేటి పోటీ ప్రపంచాన
తప్పనిసరై తాహతుకు మించి
అప్పులతో లక్షల డొనేషన్లు పిండేసి
నన్ను పిప్పి చేసి పడేసిన
నా పిల్లలు చదివే నేటి
కార్పొరేట్ స్కూల్ ముందునుంచి
వెళ్లే సమయంలో
తలెత్తి చూడగానే
'అది నిలబడడానికి
నన్ను నేలపై చతికిల పడేసింది'
అని అనిపిస్తుంది !
(ఒక మధ్యతరగతి సాధారణ ఉద్యోగికి ఇప్పటి తన పిల్లల కార్పొరేట్ విద్య తలకు మించిన భారం అయిన నేపథ్యంలో ఈ స్వగతం)