Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సి. శేఖర్(సియస్సార్),
పాలమూరు,
9010480557.
అలిశెట్టి
కవితావనంలో పూసిన వాడిపోని కవితాపుష్పం
ఆయన కవిత్వం
నాటికి నేటికీ
చైతన్య పరిమళమే
ఆయన బహుముఖ ప్రజ్ఞ
తరిగిపోని కీర్తికి చిరునామా
చిత్రకారుడిగా వేసిన చిత్రాలు
చరిత్రలో శాశ్వతాలు
మనసును రగిలిస్తాయి
మానవత్వాన్ని మేలుకొల్పుతాయి
నిజమైన మనిషికి జన్మనిస్తాయి
కవిగా ఆయనో సూర్యుడే
ఆయన గాంచిన లోకం
సమానత్వ స్వర్గం
అయన సూక్ష్మ దృష్టి
పదం పదంలో జగతిముందుంచి
హృదయగాయాలకు రూపమై మానవ జీవనసరళులను
విశ్వనరుడై వెలుగెత్తి చాటాడు
కవిమిలేములు తెలుసు
ఆకలిమంటలు తెలుసు
అసమానతలన్యాయాలు కళ్ళరాచూసి ఏకరువెట్టడం తెలుసు
ఆయన కవితలు ఎగిసిపడే జ్వాలలు
ఆయన శీర్షికలు చూస్తేచాలు
కసికసిగా చదవాలనిపిస్తుంది
'అర్థంగిని' అర్థాకలితో ఉంచినపుడు
'కన్నీళ్ళను చేటలో చెరిగినట్టు' అని చెప్పడం
పేదరికం ఆయన స్నేహితుడితో పోల్చాడు
పేదరికంతో జీవనం చేసిన
ఆయన కలానికి బలం తగ్గలేదు
ఆరోగ్యం క్షీణించినా
మరణం కబలించిన
మరణం ఆయన చివరి చరణం కాదు
ఎందరో కవులకు అది జననం
మరణంలేని సూరీడు
అలిశెట్టి భాస్కరుడు