Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నేను ....
సిగ్గు పడ్తున్నాను
సభ్య సమాజమా !
క్షమించు,
భారతీయుడిగా
నేను సిగ్గుపడ్తున్నాను
హ్యూస్టను నగర సాక్షిగా
జ్యాత్యాహంకారి
ట్రంపు ను
నా స్నేహితుడన్నశీదుకు
ఆధునిక ప్రపంచమా !
మన్నించు,
నేను సిగ్గు పడ్తున్నాను
హ్యూస్టను నగర సాక్షిగా
ఆరాచకవాది
ట్రంపును వాడి కంపును
నా భుజాల కెత్తుకున్నందుకు
ప్రజాస్వామ్య లోకమా !
మరొక్కమారు
క్షమించు,
నేను సిగ్గుపడ్తున్నాను
ఏ దేశమూ ఏ నాడూ చేయని
తప్పు చేసినందుకు
హ్యూస్టను నగర సాక్షిగా
'ఫిర్ ఏక్ బార్ ట్రంపు కా సర్కార్' అన్నందుకు
.....బత్తుల శ్రీనివాసులు