Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జి.హేమ, చింతపల్లి
78936 82021
అమ్మ !
లక్షల అక్షర పదబంధాలకు చిక్కనిది అమ్మ అనుబంధం
మధుర కవితల మధువుతో నిండనిది అమ్మ కమ్మదనం
జన్మనిచ్చే అమ్మ ముందు
జగతే పసికందు అయితే
అమ్మ ను మించిన అక్షరం అమ్మదనాన్ని మించిన కమ్మని కవిత్వం
మరుజన్మకైనా సాధ్యమగునా !