Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అయిత అనిత
8985348424
జగిత్యాల
కొన ఊపిరిలో సైతం
కవితకై కొట్టుమిట్టాడిన
పొట్టికవితల గట్టికవి!
ఆయన..
సాహితీమిత్ర దీప్తి వ్యాప్తి
నవకవులకు ప్రోత్సాహక ప్రాప్తి!
వేశ్యకవితలో వేదననైనా
సిటీలైఫ్ లో రోదననైనా
చురకలతో సమాజదేహాన్ని చరిచినా
మంటల జెండాతో
ఆకలికుంపటి రగిలించినా
ప్రాసలకు ప్రాణంపోసినా
అలిశెట్టి కలం ఓ ప్రత్యేకమే!
మినీకవితల మాంత్రికుడై
సాహితీ వినీలాకాశన మెరిసిన ధృవతార!