Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మానవత్వం లేని ఓ మోడీ
చేస్తాము నీకు మళ్ళీ షాదీ
అన్నం పెట్టే రైతును అవస్థ పెట్టకు మరి
మంకుపట్టు వీడకుంటే కడతాము నీకు ఘోరీ
అబద్దాలతో ఉద్యమంపై నీ ముప్పేట దాడి
చేస్తాము వాస్తవాలతో ప్రతి దాడి
వ్యాపారులకు దేశాన్ని తాకట్టు పెట్టి
దేశాన్ని దోచేటోళ్లకు పెద్దపీట వేసి
ఆడవాళ్లు పూజనీయులుగా
అంతర్జాతీయంగా ప్రచారం చేసి
పూజలు జరిగే గుడులలోనే
మానాలు దోచి ప్రాణాలు దీసి
దేశభక్తిపై ఉపన్యాసాలు ఇచ్చి
ప్రజలను నోరెత్తనీయకుండా చూసి
ప్రజలను మతపిచ్చిగాళ్లను చేసి
గమ్మత్తులు గిమ్మిక్కులతో అలరించి
- నాగిరెడ్డి అరుణ జ్యోతి, సూర్యాపేట
9966181561