Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ కాలం...
నాకో అద్భుత కావ్యం!!...
కొత్త కొత్త మార్పులతో..
తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తోంది!!....
కాలం సహకరించకపోతే...
అంతా కల్లోలమే!!...
కనిపించని అక్షర సత్యాలు..
ఎవరూ చదవలేని నిజకార్యాలు!!...
కాలం ఓ అంతర్యామి!!...
వర్తమాన భవిష్యత్తుకు విత్తు!!..
కాలం సొత్తు!!...
కాలం ఓ శాసనం!!
కాలం ఓ సింహాసనం!!...
మన కదలిక తనలోనే!!..
మన నడవడిక తనలోనే!!..
అందరినీ పెట్టేసి కట్టేసుకుంటుంది!!..
ఎవరుపుట్టాలన్నా...
ఏదిపుట్టాలన్నా....
లోకానికి బతుకుతెరువు కావాలన్నా...
పిడికెడు మెతుకులు పుట్టాలన్నా..
కాలం కళ్ళుతెరిస్తేనే!!...
పోయేది తనలోకే!!...
వచ్చేది తనలో నుంచే!!...
కాలమే...ఓ ప్రశ్న!!
కాలమే ఓ సమాధానం!!...
కాలం ఒక సుదీర్ఘ చూపు!!...
కాలాన్ని దాటయ్యలేరు...
కాలాన్ని కట్టెయ్యనూ లేరు...
కాలం ఎప్పుడూ ఓ కరవాలమే!!...
ఎప్పుడు ఓ నిత్య నూతనమే!!..
కాలాన్ని అర్థం చేసుకోవాలంటే...
ఈ జీవితకాలం సరిపోదు!!...
కాలం ఎప్పుడూ...
ఓ చైతన్య జ్వాలనే!!...
అందరినీ జాగృతపరుస్తుంది!!..
రవికాంచని చోటు..
కాలం కాంచగలదు!!...
కాలమే లేకపోతే..కవిఎక్కడ!!??
కాలం కళ్ళు తెరిస్తేనే..
ఈ భూమ్మీద సమస్తం కదిలేది!!...
ఇప్పుడు మన అందరం
కాలంలోనే సహజీవనం చేస్తున్నాం!!..
మన అందరినీ ఓ కంట కనిపెడుతుంది...
చివరికి అందరి పనీ పడుతుంది!!...
కాలంతో పోటీ పడొద్దు
కాలంతో కుస్తీ పడొద్దు
కాలం అందరికి నేస్తం
కాలం అందరికి వాస్తవం
కాలాన్ని ఎవరు విస్మరించినా..
కాలంలో కలిసి పోవలసిందే!!...
కాలం ఎప్పుడూ..గతి తప్పదు!!..
కాలం ఎప్పుడూ..మతి తప్పదు!!..
కాలం...ఓ విశ్వవిజేత!!..
అందరూ ఈ కాల గమనంలో...
కలిసి పోవలసిందే!!...
కాలం ఇదో మాయజాలం!!....
అంబటి నారాయణ
నిర్మల్
9849326801