Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రైతన్నల రాత మార్చ..
చట్టాలే చేసిరాయె !
తమ కష్టం కాలరాసి..
హక్కులనే అణగ దొక్కి..
తమ భవితతొ వ్యాపారం..
బతుకులతో చెలగాటం..
అందని ఆ న్యాయస్థానం..
ఇదికాదే సమ న్యాయం..??
ఉండదేమొ తమ ఉనికని..
హలం వదిలి, కదం కలిపి
పొలిమేరలు దాటేసి
చలిపులితో చెలిమి చేసి..
గళం ఎత్తి, రణం చేసి
ప్రాణాలే అర్పిస్తూ..
గగ్గోలై దీక్ష చేయ..
దిగిరాదా మన ప్రభుత..?
ఆదుకోద రాజ్యాంగం..??
మన నేతల కన్ను విప్పి..
అన్నదాత నోదార్చి..
అందించను చేయూత..
లోహ్రీనే (భోగినే) రైతన్నలు..
జరుపుకొనగ సంబరంగ !!
- సునీత మైనేని
98331 53299