Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పొలం గట్లపైన నిలబడే విధానాన్ని నేర్పింది
చెట్లు పుట్టలు తిరిగి ఆహారం పొందే పద్ధతి నేర్పింది
చిర్రాగొనే చార్ పత్తా కోతికొమ్మచ్చి గోటిలాట వ్యాయము నేర్పింది
అకాల వర్షాలు వాగులు దాటడం, ప్రమాదాలను ఎదుర్కోవడం నేర్పింది
చింత పండు కొట్టడం,బెల్లం వండేందుకు పొంటేలు కొట్టడం శ్రమ విలువ తెలిపింది నా పల్లె
ఆవులు కుక్కలు ఎద్దులు కోళ్ల తొలో మైత్రి భాగమైంది
ఇసుక గుళ్ళు .ఒక పింపరమెంట్ కాకి ఎంగిలి చేసుకొని తిన్న ప్రేమను నేర్పింది
తుమ్మ బంక సేకరించి పుస్తకాలు అంటించడం నేర్పింది
అగ్గి పెట్టెలతో టెలిఫోన్ సంభాషణ నేర్పింది
వాయిలు కొమ్మల తో బాణాన్ని తయారు చేసి ఆదుకోవడం నేర్పింది
పుస్తకాల మధ్య సరస్వతి ఆకులు పెట్టి సంతోషా పడడం అబ్బింది
విధి నాటకాలు తబా ల వాయిద్యం జడకొప్పుల ఆట నేర్పింది
ఇత చాపలు చెట్లకు తాడు కట్టి ఉయ్యాల ఊగడం
చెప్పుకోలేనాన్ని సారాధాలు .బతుకు సారం నేర్పిన నా పల్లె
ఇంటర్నెట్ వాట్సాప్ సెల్లుతో తూట్లు పొడిచింది నా పళ్ళెను
అయిన ఉమ్మడి గా ఊరంతా ఒక్కటిగా కష్టానష్టాల్లో కలసి ఉం డే
నా పల్లె ఆధునికత పేరుతో
ఉన్నది అంత మార్చి పోతుంది
రియల్టర్లు రెక్కల కింద వ్యాపారవేత్తలు చేతుల్లో అమ్ముడు పోయింది
- ఉమశేషారావు వైద్య
లెక్చరర్ ఇన్ సివిక్స్
లింగాపూర్,కామారెడ్డి