Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గొర్రెపాటి శ్రీను
9652832290
1. చెదరని వెలుగు
నా జీవన్మరణ పోరాటం నీకు తేలికగా అనిపించొచ్చు..!?
నేనెంత పట్టుదలగా లక్ష్యం కోసం శ్రమిస్తున్నానో, చూస్తున్న నీకు మామూలుగా అనిపించొచ్చు..!?
పెట్టుబడుల అహంకారం తో పుట్టిన నువ్వు మట్టిలో కలుస్తావు !
అక్షరాల సిరులతో వెలిగే నేను కవిగా ప్రజల హృదయాల్లో చిరంజీవినై నిలుస్తాను..!
2. నగర జీవితం ..
నగరజీవితం ..నిత్యం ఆకలిని తీర్చుకోడానికి అలుపెరగని పయనం !
నగరజీవితం..రాత్రని పగలని తేడాలేకుండా బ్రతకడానికి ఏదోపనిలో లీనమై యంత్రమై సాగడం !
నగరజీవితం ..సంపాదన కోసం అహర్నిశలు శ్రమిస్తూ..
పెట్టుబడిదారులు పన్నిన కుట్రలో బ్రతుకు చిద్రమైపోగా..శ్రామికుడిగానే తనువు చాలించడం !
3. స్నేహం..
కోటానుకోట్లు వెచ్చించినా దక్కదు స్వచ్చమైన స్నేహం..!
ఎదుటి మనిషి మనస్సులో అణువంత చోటు దొరికితే దాని విలువ అనంతం ..
అదే స్నేహానికి ఉన్న గొప్పతనం !
4. అమ్మ
అమ్మ కోసమై పరితపించేను పసిహృదయం !
ఆకలని చెప్పలేక శోకగీతం ఆలపిస్తుంటే..
ఆ పసిడిహృదయ భాషను అర్థం చేసుకునే ఔన్నత్యం..
పాలిచ్చి పెంచే మమకారం .. ఆకలి తీర్చగలిగే శక్తి.. ఈ జగాన ఒక్క అమ్మకే సాధ్యం !